
హవ్వ! బొంకేసింది. తనకి పిల్లలే లేరని అడ్డంగా బొంకేసింది. జనాభా లెక్కల్లోంచి ఇద్దర్ని తీసేసింది. చెట్టంత కొడుకుల్ని కాలనీ లోనే పెట్టుకుని, తాను ‘గొడ్రాలి’ నని తన నోటితోనే చెప్పేసింది. చెబుతూ నవ్వేసింది కూడా. నవ్వొచ్చి కాదు. పురుటి నొప్పులు గుర్తొచ్చి. రాసుకునే వాళ్ళు పదే పదే అడిగి, పిల్లల్లేని…