పెళ్ళీ, ప్రజాస్వామ్యమూ రెండూ ఒక్కటే. రెండూ రెండు తంతులు. తంతులో తంతులాగా, పెళ్ళితంతులో కాశీ తంతు ఒకటి వుంటుంది. శుభమా- అని పెళ్ళి జరుగుతుంటే, పెళ్ళి కొడుకు తాటాకు గొడుగు ఒకటి పట్టుకుని , చెక్క చెప్పులు వేసుకుని కాశీకి పోతానంటాడు. అప్పుడు అతని బావమరది (అనగా పెళ్ళికూతురు తమ్ముడు) వచ్చి పెళ్ళికొడుకు గెడ్డం కింద బెల్లం ముక్క పెట్టి, ‘బావగారూ, కాశీకి వెళ్ళకండి, మా అక్కను ఏలుకోండి. ప్లీజ్’ అంటాడు. అప్పుడు ఆ పెళ్ళికొడుకు కాస్త బెట్టు చేసి, వెనక్కి వచ్చేసి, పెళ్ళికూతురు చెయ్యి పట్టేసుకుంటాడు. ఈ
Category: సంపాదకీయాలు
కొడుకులే, కొడుకులు!!
అడపా దడపా పుత్రికా వాత్సల్యం కూడా వుండక పోదు.
ఇప్పటి మన నేతలు ఈ విషయంలో దృతరాష్ట్ర, ద్రోణాచార్యుల రికార్డులు కొట్టేస్తున్నారు. కొడుకు( సుయోధనుడి) మీద వున్న ప్రేమతో కొడుక్కి పోటీరాగల భీముడి శిలా ప్రతిమను తన ఉక్కు కౌగిలో తుక్కుతుక్కు చేసేస్తాడు ధృతరాష్ట్రుడు. కొడుకు అశ్వత్థామ చనిపోయాడన్న ‘గాలి వార్త’ వినగానే, ధ్రువపరచుకోకుండానే, యుధ్దంలో అస్త్రాలు వదిలేస్తాడు ద్రోణుడు.
కొడుకులు తర్వాతే, ఎవరయినా. ఇదే నాటి భారతం, నేటి భారతం కూడా.
వందే మాతరం! ‘వంద’ యేమాత్రం?
బిచ్చగాడే కావచ్చు.
‘అమ్మా! ఆకలి!!’ అంటాడు. కానీ, అన్నం పెడితే కన్నెర్రచేస్తాడు.
‘బాబూ! ధర్మం!!’ అంటాడు. కానీ, బియ్యం వేస్తే కయ్యానికొస్తాడు.
అలా కాకుండా దగ్గరకు పిలిచి ‘ఇదిగో పది’ అన్నామనుకోండి. వాడి ముఖం వెలిగి పోతుంది.
ఇలాంటి పదులు- మూడోనాలుగో వస్తే, ఏదయినా చేసుకోవచ్చు: క్వార్టర్ కొట్టొచ్చు. సినిమాకెళ్ళొచ్చు. గుట్కా వెయ్యొచ్చు.
మోడీకి మరో వైపు ఓవైసీ!
ద్వేషాన్ని మించిన ప్రేలుడు పదార్థం రాజకీయాల్లో లేదు. మరీ మత ద్వేషం అయితే ‘ఆర్డీఎక్స్’ కన్నా ప్రమాద కరం.
ఒక్క ద్వేషంతో సర్కారును పేల్చిపారేయవచ్చు. ప్రేమతో ఒక్కటి కాని మనుషుల్ని పగతో ముడివేయ వచ్చు. దేశంలో నగల షాపులున్నట్లే ఎక్కడికక్కడ పగల షాపులున్నాయి. ఇక్కడ సరసమైన ధరల్లో రకరకాల ద్వేషాలు అమ్మేస్తుంటారు: ప్రాంతీయ విద్వేషం. కులద్వేషం, లింగ ద్వేషం, భాషా ద్వేషం, మత ద్వేషం. అయితే అన్నింటి ధరలు ఒకటి కావు. అన్నింటికన్నా చౌకగా వుండీ, అందరికీ అందుబాటులో వుండే ద్వేషం- మత ద్వేషం.
లైంగికోగ్రవాదులు!
అత్యాచారాలు జరిగినప్పుడెల్లా అల్లర్లు జరగవు
అల్లర్లూ, ఆందోళనలు జరిగినప్పుడు- అందరూ బెంగపడిపోతారు. సర్కారూ, పోలీసులూ మాత్రం భంగపడిపోతాయి.
ఈ బెంగపడ్డ వారిలో పెద్దలూ, పిన్నలూ, ఆడవాళ్ళూ, మగవాళ్ళూ అందరూ వుంటారు. ఇలా మళ్ళీ మళ్ళీ జరగకుండా వుండటానికి ఏమి చెయ్యాలీ- అన్నప్పుడు ఎవరికి తోచిన సలహాలూ, సూచనలూ వారిస్తారు. ఢిల్లీ బస్సులో కిరాతకంగా జరిగిన అత్యాచారం తర్వాత ఈ సూచనలకు మరింత విలువ పెరిగింది. ఈ సూచనల్ని సూక్ష్మీకరిస్తే రెండు రకాలు తేలతాయి:నివారణ, చర్య.
‘గుజ’ బలుడు మోడీ
ఓడలు బళ్ళవుతాయి: అద్వానీలు మోడీలవుతారు.
బళ్ళు ఓడలవుతాయి: మోడీలు అద్వానీలవుతారు.
అలనాడు అద్వానీకి అనుంగు శిష్యుడు మోడీ. కానీ ఇప్పుడు, అదే అద్వానీ ‘న.మో’ అంటున్నారు.
రేపో, మాపో, అద్వానీ తాను వెనక్కి తగ్గి పోయి- ప్రధానివి నువ్వే- అని మోడీతోఅన్నా ఆశ్చర్యం లేదు. ఇప్పటికే పోటీలో వున్న వాళ్ళంతా ఇలాంటి ఆశీస్సులే ఇచ్చేస్తున్నారు.
రాష్ట్ర విభజన కాదు, పార్టీల విభజనే!
అదే సీన్: అఖిల పక్షం: షూటింగ్ స్పాట్: ఢిల్లీ. తేదీ: 28 డిశంబరు 2012
సినిమాటోగ్రాఫర్: సుశీల్ కుమార్ షిండే.
కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సోనియా గాంధీ
ఒక్కో పార్టీకి ఒక్క పాత్రే వుంటుంది. కానీ ఇద్దరేసి పోషించాలి. అదికూడా ఒకరి తర్వాత ఒకరు కాదు. సమాంతరంగా ఒకే సమయంలో పోషించాలి. ఒకరు ‘అవునూ’ అంటూంటే, ఒకరు ‘కాదూ’ అనాలి.
‘చేతి’కి ఎముక లేదు!
పిలిచి పదవులిస్తానన్నా పారిపోతున్నారు ఎమ్మెల్యేలూ, ఎంపీలు. ఇదెక్కడి విడ్డూరం- అంటూ విస్తుపోతున్నది రాష్ట్రంలో కాంగ్రెస్.
ఇవ్వాలనుకుంటే, నామినేటెడ్ పదవులు చాలా వున్నాయి. మంత్రి వర్గంలో కూడా మరికొన్ని బెర్తుల్ని సృష్టించ వచ్చు. ఇన్ని తాయిలాలు వున్నా, కాంగ్రెస్ ప్రజాప్రతినిథులు, సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెస్ వైపూ, తెలంగాణలో టీఆర్‌ఎస్ వైపూ పరుగులు తీస్తున్నారు.
‘బతికుంటే బలిసాకు తినొచ్చు’ అన్న చందంగా, ‘మళ్ళీ ఎన్నికయితే మాజీ కాకుండా బతకొచ్చు’ అనుకుంటూ దూకేస్తున్నారు.
‘వోటు’ బ్యాంకుల్లో డిపాజిట్లు గల్లంతు!
బ్యాంకుల్ని ప్రయివేటు పరం చేసినట్లే, వోటు బ్యాంకుల్ని పార్టీల పరం చేస్తుంటారు. ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క బ్యాంకులో వోట్లను డిపాజిట్టు చేసుకుంటూ వుంటుంది.
ఇందిరాగాంధీ రోజుల్లో ఎస్సీ, ఎస్టీల వోటు బ్యాంకులో కాంగ్రెస్‌కు పెద్ద యెత్తున నిల్వలు వుండేవి. అయితే రాను రాను, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పార్టీ ‘టేకోవర్’ చేస్తూవుంది.
ఓవర్ టూ తెలంగాణ!
అవినీతా? అంతా ‘గ్యాస్’!!
దేవుళ్ళేనా అవతరాలెత్తేదీ..? దయ్యాలెత్తవూ..?!
హీరోలు మారినప్పుడు.. విలన్లు మారరూ?
అలాగే, నీతి మారినప్పుడు, అవినీతీ మారుతుంది.
ఒకప్పటి అవినీతి అంటే- మామూలు, బల్లకింద చెయ్యి, అమ్యామ్యా..! ‘సంతోషం’. అవును ఇది కూడా అంచానికి ‘పర్యాయ పదం’. పుచ్చుకునే వాడు ముఖమాట పడుతూంటే ఇచ్చే వాడు ‘ఏదో, మా సంతోషం కొద్దీ..!’ అని నాలుగు కట్టలు చేతిలో పెడతాడు. లోపల మాత్రం కట్టలు తెగిన దు:ఖం వుంటుంది లెండి.
మ్యాచ్ ఫిక్సింగ్!-: – మనీ మిక్సింగ్!!
వియ్యమన్నాక– వావీ, వరసల ప్రస్తావన వస్తుంది. వరసయిన వారితోనే ‘మ్యాచ్ ఫిక్సింగ్’ వుండాలి. వరసలు తప్పితేనే అల్లరవుతారు.
రాజకీయ వియ్యాల్లోనూ ఇదే నియమం. వరస తప్పకూడదు. ఉదాహరణకు ‘కాషాయానికీ’, ‘ఎరుపున’కూ వియ్యం కుదరదు. అనగా ‘కమలాని’కీ, ‘కొడవలి’కీ మధ్య ‘ఎఫైర్’ నడవదన్నమాట. (కమలమొచ్చి, కొడవలి మీద పడ్డా, కొడవలి వచ్చి కమలం మీద పడ్డా- తెగిపడేది కమలమే!)
కదలని’చెయ్యి’- వదలని’గులాబి’!!
తెలంగాణ సమస్య తెగిపోతుంది, మబ్బు విడిపోతుంది.
ఇది తెలంగాణలో ఆశావాదుల జోస్యం.
తెలంగాణ సమస్య జటిలమవుతుంది. మళ్ళీ రెండు ప్రాంతాల్లో చిచ్చు రేగుతుంది.
ఇది తెలంగాణలోని నిరాశావాదుల భయం.
బహుశా, కేంద్రం నిర్ణయం రెంటికీ మధ్య వుంటుంది
కయ్యానికి చిరు- నెయ్యానికి కెవిపి!
ఏ కాంగ్రెస్ ను వోడిస్తానని తొడలు చరిచారో, అదే కాంగ్రెస్‌కు ద్రోహం జరుతోందని కుమిలి పోయారు. రెండు పాత్రలూ ఒకే హీరో పోషించారు. మామూలు హీరో కాదు. ‘మెగా’ హీరో చిరంజీవి. తొడలు చరిచినప్పుడు ‘ప్రజారాజ్యం’ వ్యవస్థాపకుడు. కుమిలి పోయినప్పుడు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు. కొందరు ‘ఇక్కడి(కాంగ్రెస్) తిండి తిని, అక్కడి( వైయస్సార్ కాంగ్రెస్) పాట పాడుతున్నానన్నారు. ఇదే సామెతను ఆయనకు అనువుగా పేరడీ చేయవచ్చు. ‘అక్కడి( ప్రజారాజ్యం) వోటుతో గెలిచి, ఇక్కడి(కాంగ్రెస్) సీటులో కూర్చున్నారు’ అని.
తెలంగాణ కథ మొదలుకొస్తుందా?
సెప్టెంబరు 30, 2012 .ఇది తేదీ కాదు. ముహూర్తం. సాక్షాత్తూ ‘చంద్రశేఖర సిధ్దాంతి’ పెట్టిన అనేకానేక ముహూర్తాల్లో ఇది ఒకటి. ఆయన లెక్క ప్రకారం ఈ తేదీ లోగా తెలంగాణ సమస్యకు ‘శుభం’ కార్డు పడిపోతుంది. ఆయన ప్రత్యేక ‘పంచాంగం’లో ఇలాంటి తేదీలు ఇంతకు ముందు చాలా గడచిపోయాయి. అయితే ముహూర్త బలాన్ని ఏమాత్రం శంకించాల్సిన పనిలేదు. ఎటొచ్చీ ఆయన ముహూర్తం పెట్టే వాడే తప్ప, శుభకార్యం జరిపించే వాడు మాత్రం కాదు.
గాంధీ భవన్‌లో ‘ప్రజారాజ్యం’?
2014. ఇది ఒక అంకె కాదు. ఒక గురి. చేప కన్ను. మన రాష్ట్రంలో నే కాదు, కేంద్రంలో కూడా అందరి లక్ష్యం 2014.
ఈ ‘విజన్ 2014’ను సాకారం చేసుకోవటానికి ఎవరి కసరత్తు వారు చేస్తున్నారు. అన్ని పార్టీల కన్నా, అధికారంలో వున్న కాంగ్రెస్ ఎక్కువ హడావిడి చేస్తోంది. ఢిల్లీలో రాహుల్‌ని ప్రధానిని చెయ్యాలి. అందుకు తగ్గట్టుగా పెద్ద రాష్ట్రాలన్నిటితో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ పార్లమెంటు సీట్లను కొట్టేయాలి. రాష్ట్రంలో మరో మారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. ఇదే ‘సోని(యా) విజన్ 2014.
కుచేలుడి ‘కుబేర’ భక్తి!
‘వెండితెర’ తీస్తే… వనితల మెడలో ఉరితాళ్ళే!!
(ఇంట్రో…
పదిహేనేళ్ళ క్రితం నాటి మాట. నేను అప్పుడు వార్త దినపత్రికకు అసోసియేట్ ఎడిటర్ వున్నాను. సిల్క్ స్మిత చనిపోయిందన్న వార్త న్యూస్ ఏజెన్సీల ద్వారా మాకు చేరింది. ఆమె చనిపోవటం కన్నా, చనిపోయిన తీరు నన్ను బాధించింది. ఆ రోజు ఆమె మీదనే సంపాదకీయం రాయాలని నిర్ణయించుకున్నాను. రాసేశాను. ఇంకా అది పేజీల్లోకి వెళ్ళకుండానే, ఎలా తెలిసిందో మార్కెటింగ్ విభాగం వారికి తెలిసిపోయింది. అప్పటి జనరల్ మేనేజర్ అయితే కంగారు పడ్డాడు. ‘ఆమె ఏమన్నా మహానటి సావిత్రా? వ్యాంప్ (రోల్స్ వేసుకునే ఆమె) మీద సంపాదకీయమా? పరువు పోతుంది.’ అన్నాడు. నేను వినలేదు.
మేతకు ముందు! నీతికి వెనుక!!
ఒకటి: కామన్ వెల్త్!
రెండు: ఆదర్శ్!!
మూడు:స్పెక్ట్రమ్!!!
ఈ మూడింటి గురించి నీ కేమి తెలియును?
ఇలా ఏ పోటీ పరీక్షల ప్రశ్నాపత్రంలో నైనా ఇస్తే, సమాధానాలు ఎలాగుంటాయి?
ఒకటి: యూ…జర్ ఛార్జ్
రెండు: పీ…నాల్టీ
మూడు:ఎ…డిషనల్ టాక్స్.
వెరసి ‘యూ. పీ, ఎ’ సర్కారు తిరిగి రెండవ సారి ఎన్నుకున్న ప్రజలకు ఇచ్చే పరిహారం.
దీని పేరే అవినీతి.
‘పోవోయ్’ అంటే-‘మావో’య్ అన్నారు!
వాళ్ళ ముందు
ఇస్లామిక్ టెర్రరిస్టులూ చిన్నవారే.
హిందూ ఉగ్రవాదులూ పిపీలకాలే.
అండర్ గ్రౌండ్ మాఫియాలూ అంగుష్ట మాత్రులే.
వాళ్ళ పేరు చెబితే-
ఒక్క రాష్ట్రమే కాదు. అన్ని రాష్ట్రాలూ హడలెత్తిపోతాయి.
ఆ మాట కొస్తే ప్రభుత్వమే కాదు.
దేశీయ కాంట్రాక్టర్లూ, విదేశీ బహుళజాతి సంస్థలూ బిక్కచచ్చిపోతాయి.
వారున్న చోటా భయమే. వారు లేకున్నా భయమే.
వారి మౌనమూ, అలికిడీ – రెండూ ఆందోళన కరమే.
ఎవరూ వారు? బరినీ, గిరినీ తెగించిన వారు.
‘చావో, మావో’ అని తెంపుచేసుకున్నవారు.
అవతరించినప్పుడు నక్సలైట్లు. ఇప్పుడు మావోయిస్టులు.