తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మూడేళ్ళవుతోంది. ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీగా టీఆర్‌ఎస్ అందలమెక్కింది. అంకెల్లో చూస్తే పాలన అద్భుతంగా వున్నట్లుంటుంది. అక్షరాలా ఎలావుందన్నదే ప్రశ్న. ముందుకు వెళ్తుందా..? వెనక్కి వెళ్తుందా? అసలిదేం ప్రశ్న? సార్వత్రిక ఎన్నికలే కాదు, తర్వాత ఏ ఎన్నిక జరిగినా టీఆర్‌ఎస్ క్లీన్ స్వీప్ చేసేసింది. విపక్షాలు విలవిలలాడిపోయాయి. చిన్నా చితకా నేతలు…
Category: సంపాదకీయాలు
యూపీలో విజయం: మోడీ మంత్రం కాదు; కుల, మతాల తంత్రం!
మినీ భారతంగా పేరుగాంచిన ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ మరోమారు తన కాషాయపతాకాన్ని ఎగుర వేసింది. 2014 సార్వత్రిక ఎన్నికలలో 80 పార్లమెంటు సీట్లకూ 73 స్థానాలను గెలుచుకున్న బీజేపీ, కొంచెం తేడాలో రెండేళ్ళ తర్వాత అసెంబ్లీ ఎన్నికలలో కూడా అదే వేగాన్ని కొనసాగించింది. 403 స్థానాలలో 324 సీట్లను గెలుచుకుని, కలసి పోటీ పడ్డ సమాజ్ వాదీ…
రాజధాని అంటే కట్టడం కాదు..నమ్మకం!
‘దేశ భక్తి’ ముసుగులో ‘ద్వేష’ భక్తి!
బ్యాలెట్ భాష ద్వేషం అయినప్పుడు, బులెట్ భాష ద్వేషం కాకుండా పోతుందా? ‘అమెరికాయే ముందు’ అనీ ‘అమెరికన్లే ముందు’ అని ప్రమాణ స్వీకారం నాడే కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భీషణ ప్రతిజ్ఞ చేశారు. కొందరికిది ‘దేశభక్తి’లాగా కనిపించ వచ్చు. కానీ ఇది ‘ద్వేష భక్తి’ అని రాను రాను తెలుస్తూ వచ్చింది. అమెరికాయే వలసలు…
‘గ్రేటర్’ కోట పై ‘గులాబీ’ జెండా..!?
‘గ్రేటర్’ కోట పై ఏ జెండా ఎగురుతుంది? ఈ చర్చ కేవలం హైదరాబాద్ కే పరిమితం కాదు. అలాగని రెండు తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితమయినది కూడా కాదు. దేశం మొత్తం ఆసక్తితో ఎదురు చూస్తున్నది. ఎన్ని పార్టీలు బరిలో వున్నా, అంతిమంగా ఆడేది మూడు ముక్కలాటే! అవును. ముక్కోణపు పోటీయే. టీఆర్‌ఎస్- మజ్లిస్‌లు పేరుకు వేర్వేరుగా పోటీ చేస్తున్నా, ఈ రెంటిదీ ఒకే ముఖం. ఆ పార్టీల మధ్య ముందస్తు అవగాహన వుంది. కార్పోరేటర్ ఎన్నికలు ముగిశాక, మేయర్ ఎన్నికలప్పుడు కలవాలన్నది అవగాహన సారాంశం. ఇక ఒక డజను డివిజన్లలో కత్తులు దూసుకున్నా, ఇతర డివిజన్లలో బీజేపీ- టీఆర్‌ఎస్‌ల మధ్య అధికారికమైన పొత్తు వుంది. ఇక మూడవది కాంగ్రెస్ పార్టీ. అయితే గెలుపు వోటములతో సంబంధం లేకుండా లోకసత్తా, వామ పక్షాలు కలిపి మరో కూటమి వుంది కానీ, యుధ్ధక్షేత్రం వారి ఉనికి నామ మాత్రంగానే వుంటుంది. కాబట్టి అంతిమంగా వుండేది త్రిముఖ పోటీ మాత్రమే.
‘సెటిలర్’ అంటే మాట కాదు, వోటు!
సెటిలర్. హఠాత్తుగా ఈ మాట ముద్దొచ్చేస్తోంది. అది కూడా ఎక్కడ? గ్రేటర్ హైదరాబాద్‌లో. ఒక్క సారి రెండేళ్ళ వెనక్కి వెళ్ళితే, తెలంగాణ లో ఇదే తిట్టు. కానీ, అట్టు తిరగబడింది. తిట్టు కాస్తా వొట్టు అయింది. సెటిలర్ల మీద వొట్టేసి చెబుతున్నారు కేటీఆర్: ‘నేను కూడా సెటిలర్ నే’. ఇలా అన్నాక, చిన్న గ్యాప్ ఇచ్చి. ‘తెలంగాణ పల్లె నుంచి హైదరాబాద్ వచ్చాను కదా… సెటిలర్‌ని కానా?’ అన్నారు. మరీ రెండేళ్ళ క్రితమో…! నేరుగా ఆయన అని వుండక పోవచ్చు కానీ, ఆయన పార్టీ నేతలు ఏమన్నారు? సెటిలర్లు మూటా, ముల్లె సర్దుకోవలిసందే.. అని. అంతెందుకు కేసీఆర్ మాత్రం అనలేదూ! సీమాంధ్ర ఉద్యోగుల్లో కొందరికి ఆప్షన్ల ఇచ్చే ఆలోచన చేసేది వుందా? అన్న ప్రశ్న వచ్చినప్పుడు ‘ఆప్షన్లూ లేవు, గీప్షన్లూ లేవు’ అని అనేయ్ లేదూ! (అఫ్ కోర్సు !కొన్నాళ్ళ తర్వాత ఆంధ్రుల కాలికి ముల్లు గుచ్చుకున్నా, పంటితో తీస్తానని కూడా అన్నారు. అది వేరే విషయం.) ఇప్పుడు ‘సెటిలర్’ అనేది కేవలం మాట కాదు, వోటు. ఈ వోటు ఎటు వైపు వెళ్తుంది?
ఇది ‘గ్రేటర్’ నామ సంవత్సరం!!
‘గ్రేటర్’! కొత్త ఏడాది(2016) ఏ మాటతోనే మొదలవుతుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో పౌరులందరూ ‘హ్యాపీ న్యూయియర్’ అని ఒకరినొకరు అభినందించుకోవచ్చు. అందు వల్ల ఆనంద పొందవచ్చు. కానీ ఈ రాష్ట్రాలలో నేతల్ని ఆనందింప చెయ్యాలంటే మాత్రం ‘హ్యాపీ న్యూయియర్’ అని అనకుండా ‘గ్రేటర్ న్యూయియర్’ అనాలి. అప్పుడు విన్న నేత ముఖం వెలుగుతుంది. తెలుగు సంవత్సరాలకు నెంబర్లతో పాటు, పేర్లు కూడా వుంటాయి. కానీ ఇంగ్లీషు సంవత్సరాలకు అంకెలు మాత్రమే వుంటాయి. కానీ 2016కు మాత్రం ఈ రెండు రాష్ట్రాల వారూ పేరు కూడా పెట్టుకోవచ్చు. అదే ‘గ్రేటర్’ నామ సంవత్సరం.
బీజేపీ-కాంగ్రెస్‌ల సమర్పణ: ‘స్వామి..రారా!’
స్వామి తలచుకుంటే కేసులకు కరువా? ‘కలహభోజనుడు’ సుబ్రహ్మణ్య స్వామి అంటేనే వివాదం. ఆయన ఏ పార్టీలో వున్నా ‘వన్ మ్యాన్ ఆర్మీ’ (ఏక సభ్య సైన్యం) లాగా వుంటారు. కూపీలూ లాగటంలోనూ, లొసుగులు వెతకటంలోనూ దిట్ట. అయితే అన్ని కూపీలూ నిలబడవు. కొన్ని వీగిపోతుంటాయి. ఆయన ఎవరి మీదయినా గురిపెట్టారంటే, ఇక వారి చుట్టూనే తిరుగుతుంటారు. రాజకీయంగా ఆయనకు కాంగ్రెస్ మీద ఎప్పుడూ ఒక కన్ను వేసే వుంచుతారు. ఈ మధ్య కాలంలో ఆయన కారణంగా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ రెండు సార్లు వివాదాల్లో చిక్కుకున్నారు.
డయిల్ ‘ఎమ్’(మనీ) ఫర్ మర్డర్!?
పైసలే ప్రాణాలు. ఇది మార్కెట్ యుగ ధర్మం. అందుకే రూపాయిని డాలర్‌లోకీ, డాలర్‌ని రూపాయిలోకీ మార్చుకున్నంత సులువుగా, పైసల్ని ప్రాణాల్లోకి, ప్రాణాలను పైసల్లోకి మార్చుకోవచ్చు. ప్రాణాలిచ్చేస్తాను, పైసలిచ్చేయ్- అంటూ ప్రాణత్యాగం చేసే వారుంటారు. అందుకే ఎక్స్‌గ్రేషియాకోసమో, రుణ మాఫీ కోసమో మరణించే పేదలూ, రైతులూ చనిపోవటం ఇక్కడ ఆశ్చర్యం కాదు. తాను పోతే, తనతో పాటూ తాను చేసిన అప్పూ పోతుందనో, లేక ఎంతో కొంత ఆర్థిక సాయం సర్కారు తన కుటుంబానికి చేస్తుందనో ఆత్మహత్యలు చేసుకునే వారున్నారు.
డాక్టర్. డెత్. ఎం.బి.బి.యస్!
శంకర్ దాదా ఎంబిబిఎస్‌లూ, మున్నాభాయ్ ఎంబీబీఎస్‌లూ తెరమీద నుంచి జీవితంలోకి వచ్చేస్తే ఎలావుంటుంది. హింసే ఔషధంగానూ, హత్యే చికిత్సగానూ మారిపోతుంది. ‘ఆయువు’ని పోయటం కాకుండా ‘ఆయువు’ని తీయటమే ఆయుర్వేదం అయిపోతుంది. ‘హోమ్’ నుంచి ‘టూంబ్’కి పంపించటమే హోమియో పతి అయిపోతుంది. వల్లకాడికి దారి చూపటమే అల్లోపతి అయిపోతుంది.
ఎమ్మెల్సీలుగా ’జంప్ జిలానీ‘లు!
రెండు తెలుగు రాష్ట్రాలలలో పెద్దల సభలు యుధ్ధానికి సిధ్ధమవుతున్నాయి. ఈ యుధ్ధం ఆంధ్రప్రదేశ్‌లో అంతర్గతం; తెలంగాణలో బహిర్గతం. ఆంధ్రప్రదేశ్‌లో నిజంగానే తెలుగుదేశం పార్టీలో కుమ్ములాటలాగ మొదలయింది. తెలంగాణలో అలా కాదు, ఇది పార్టీల మధ్య పోరులాగా మారింది. కానీ రెండు చోట్లా అధికారపక్షాలకు ‘పెద్దలు’ అన్నమాటకు నిర్వచనాలు మార్చుకున్నారు.
చీలిక మంచిదే… కోరిక తీర్చింది!
మరక మంచిదే… అన్నట్టుగా, విభజన మంచిదే అన అంటున్నారు. చిత్రం. ఈ మాటను ‘విభజన’ వాదుల కన్నా, ‘సమైక్య వాదులు’ అంటున్నారు. మరీ ముఖ్యంగా రెండు తెలుగురాష్ట్రాలలోని ఆర్టీసీ కార్మికులూ ఇదే మాట అంటున్నారు.
ఆర్టీసీ కార్మికులకు కష్టాలూ కొత్త కాదు, సమ్మెలూ కొత్త కాదు. గతంలో కూడా జీతాల పెంపు కోసం సమ్మెలు చేశారు. ఎప్పుడూ తమ డిమాండ్లు ప్రభుత్వం ముందు వుంచినా, కార్మికులే ఎక్కువగా దిగి రావాల్సి వచ్చేది
హ్యాంగ్ ‘రేప్ కల్చర్’!
చూసిందే చిత్రం కాదు, తలకిందులగా చూసింది కూడా చిత్రమే. అందుకేమరి. చిత్రాన్ని తియ్యటమే కాదు, చూడటం కూడా తెలియాలి. ఆలోచనలు తలకిందులు వున్నప్పుడు అన్నీ విపరీతంగా అనిపిస్తాయి. కాళ్ళతో చప్పట్లు కొడుతున్నట్లూ, చేతులతో పరుగెత్తుతున్నట్టు కూడా అనిపిస్తాయి. ఇప్పుడు దేశంలో ఈ వైవరీత్యం నడుస్తోంది.
పాపం ఆవిడెవరో దేశం కానీ దేశం నుంచి వచ్చి, మన దేశాన్ని కుదిపేసిన ‘నిర్భయ’ ఘటన మీద ఒక డాక్యుమెంటరీ తీశారు
కేసీఆర్ ‘భూ’ ప్రదక్షిణం!
వైయస్సార్ అంటే ‘నీరు’; కేసీఆర్ అంటే ‘భూమి’. అవును. (ఉమ్మడి) రాష్ట్రంలో వైయస్సార్ ముఖ్యమంత్రి కాగానే ‘జల యజ్ఞాన్ని’ చేపట్టారు. ఎక్కడికక్కడ సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని తలపెట్టారు. విపక్షాలు దీనిని ‘ధనయజ్ఞం’గా అభివర్ణించే వారు. ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయినది మొదలు ‘భూమి’ ‘భూమి’ అంటూనే వున్నారు. ఆయన దృష్టి అంతా ‘భూమి’ మీదనే పడింది. తొలుత అన్యాక్రాంతమయిన ‘గురుకుల్ ట్రస్టు’ భూముల మీద గురిపెట్టారు. ఆ భూముల నిర్మించిన కట్టడాలను కూలగొట్టటానికి సన్నధ్ధమయ్యారు. తర్వాత వరాలు ఇవ్వటంలో కూడా ‘భూ’భ్రమణం చేశారు. దళితులకు కుటుంబానికి మూడు ఎకరాల భూమిని ఇస్తానని వాగ్దానం కూడా చేశారు. అసెంబ్లీలోని బడ్జెట్ సమావేశాల ముగింపు సన్నివేశంలో కూడా కేసీఆర్ ను రక్షించింది మళ్లీ ‘భూమే’
బడ్జెట్ అంకెలు: 3 అరుపులూ, 4 చరుపులూ!!
బడ్జెంట్ అంటే అంకెలూ కాదు, పద్దులూ కాదు! మరి? రంకెలూ, వీలయితే గుద్దులూ..! (కంగారు పడకండి. గుద్దుళ్ళూ అంటే, బల్ల గుద్దుళ్ళే లెండి.) బడ్జెట్ సమావేశాలను తిలకించవచ్చు. తెలుగు వారు ఒక్కరాష్ట్రంగా వున్నప్పుడూ, విడిపోయాక కూడా ఇదే తంతు. నెలల తేడాతో జరిగిన రెండు రాష్ట్రాల బడ్జెట్ సమావేశాల్లోనూ ఇదే ముచ్చట.
అయితే అరుపులూ, బల్లల చరువులూ అప్పటికప్పుడు పుట్టుకొచ్చిన ఆవేశకావేశాలనుంచి రావు. వీటన్నిటికీ కూడా ముందస్తు వ్యూహం వుంటుంది. ఫలానా సభ్యుడు ఊరికే నోరు జారాడూ అంటారు కానీ, అది నిజం కాదు. ‘ఊరక (నోరు) జారరు మహానుభావులు’. దానికో ప్రయోజనం వుంటుంది.
బాబు ‘గ్రహ’ స్థితి మారిందా?
ఆంధ్రప్రదేశ్‌లో ఎవరు గ్రహం? ఎవరు ఉపగ్రహం? బీజేపీ, తెలుగుదేశం పార్టీల విషయంలో పరిశీలకులకు కలుగుతున్న సందేహమిది. రెంటి మధ్యా ‘వియ్యమూ’ కొత్త కాదూ, ‘విడాకులూ’ కొత్త కాదు. ఇంతకు ముందు కూడా బీజేపీతో తెలుగుదేశం పార్టీ కలిసి ‘కాపురం’ చేసింది. తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్టీరామారావు బీజేపీని పూర్తిగా దూరం పెట్టినా, ఆ తర్వాత పార్టీ పగ్గాలు అందుకున్న చంద్రబాబు నాయుడు మాత్రం బీజేపీతో ‘దాగుడు మూతలు’ ఆడుతూనే వున్నారు. ఆయనకి ఈ పార్టీ ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క విధంగా కనిపిస్తుంది.
సంకీర్ణాన్ని మోడీ తుడిచేస్తారా?
రాజ్యం తర్వాత రాజ్యాన్ని కైవసం చేసుకుంటూ వెళ్ళే దండయాత్రలాగా, నరేంద్రమోడీ-అమిత్ షాలు రాష్ట్రాన్ని తర్వాత రాష్ట్రాన్ని కైవసం చేసుకుంటూ వెళ్తున్నారు. మహారాష్ట్ర, హర్యానాలు ముగిసాయి; ఇప్పుడు జమ్మూ-కాశ్మీర్, జార్ఖండ్‌లు, వెను వెంటనే ఢిల్లీ. మహరాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు ఇంకా 22 సీట్లు తక్కువ వచ్చినా, హర్యానాలో సంపూర్ణమైన మెజారిటీయే వీరి నేతృత్వంలో బీజేపీ సాధించింది. రెండు చోట్లా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. పార్లమెంటు ఎన్నికల తర్వాత నుంచీ ‘మోడీ-షా’లు రాజకీయంగా ఒక సందేశాన్ని దేశమంతటా పంపిస్తున్నారు: ‘సంకీర్ణయుగం ముగిసింది’. ఈ సందేశాన్ని ముందు వారు ‘మనోవాక్కాయ కర్మణా’ నమ్మాలి.
‘రుణ’మో…పణమో!
రైతు పెరిగి పారిశ్రామిక వేత్త కావటం నిన్నటి పరిణామం. కానీ పారిశ్రామిక వేత్త ముదిరి రైతు కావటం రేపటి విపరీతం. అవును. ఇది నిజం. కేంద్రంలో కానీ, రాష్ట్రాలలో కానీ అధికారం లో ఎవరు వున్నా, ఇలాంటి భవిష్యత్తుకే బాటలు వేస్తున్నారు. కానీ చిత్రమేమిటంటే, రైతును ముంచే ప్రతిచర్యనూ రైతు క్షేమం పేరు మీద చేస్తున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, చికిత్స కోసం వచ్చిన రోగికి ఔషధమని చెప్పి, విషాన్నిస్తే ఎంత గొప్పగా వుంటుందో, ఈ చర్యకూడా అంత గొప్పగానే వుంటుంది. నిజం చెప్పాలంటే, ‘ఎల్‌పీజీ’ (లిబరలైజేషన్, ప్రయివేటైజేషన్, గ్లోబలైజేషన్) ఆర్థిక విధానం దేశంలోకి వచ్చాక, ఏ పార్టీ సర్కారయినా, ఇదే పనిచేసింది.
సీమాంధ్ర కాంగ్రెస్ ‘మాయ’ఫెస్టోై!
ఎన్నికలలో ఎవరి టెన్షన్ వారికి వుంది. కారణం కోరిక. గెలిచితీరాలనే పట్టుదల. కానీ ఎలాంటి ఆందోళన లేని వారు కూడా రాష్ట్రంలో వున్నారు. వారే సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు. నిండా మునిగిన వారికి కొత్తగా చలి పుట్టుకు రాదు. వీరి పరిస్థితి అంతే. ఎలాగూ గెలవమని తెలిసిపోయాక, ‘అవశేషాంధ్రప్రదేశ్’లో అధికారానికీ, తమకీ సంబంధం లేదనీ ముందే అర్థమయి పోయాక, అన్ని పనుల్లూ తంతుల్లా జరిగిపోతాయి. పార్టీ టిక్కెట్ల పంపిణీ దగ్గర నుంచి, ప్రచారం వరకూ పధ్ధతి ప్రకారం జరిగిపోతాయి. రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్నప్పుడే కాంగ్రెస్ అధిష్ఠానం ఈ పరిస్థితి ఊహించి వుండాలి. కాబట్టి ఇక్కడి స్థితి వారిని ఎలాంటి ఆందోళనకూ గురి చెయ్యదు.
మన జేపీ, కేజ్రీవాల్ కాలేరా?
‘చీచీచీ చీనా వాడు, చౌచౌచౌ చౌనీ దాన్ని ప్రేమిస్తాడు’ అన్నాడు శ్రీశ్రీ. ఏ రేంజ్‌కు ఆ రేంజ్ ప్రేమలుంటాయి. మమమ మైక్రోసాఫ్ట్‌లో పనిచేసే కుర్రాడు వివివి విప్రోలో పనిచేసే కుర్రదాన్ని ప్రేమిస్తాడు. రాజకీయాల్లో పొత్తులు కూడా అంతే. పేరు మోసిన పార్టీల మధ్యే పొత్తులు వుండాలన్న రూలు లేదు. నిన్న మొన్న పుట్టుకొచ్చిన పార్టీలు కూడా పొత్తులు పెట్టుకోవచ్చు. పువ్వు పుట్టగానే ‘ప్రేమించినట్టు’, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) పుట్టగానే పొత్తు పెట్టుకోవటానికి సిధ్దపడుతోంది.