‘సూటేంద్ర’ మోడీ!

పేరు : నరేంద్ర మోడీ

దరఖాస్తు చేయు ఉద్యోగం: ‘విదేశాంగ’ ప్రధాన మంత్రి ( ఇంతవరకూ విదేశాంగ శాఖ కు ఒక మంత్రి బాధ్యత వహించేవారు. నేను వచ్చాక, ఇందుకు మంత్రి మాత్రమే సరిపోరనీ, ఆ శాఖను నిర్వహించటానికి ప్రధాన మంత్రి స్థాయి వ్యక్తి వుండాలనీ నిర్ణయించాను. ఇందుకు విదేశాంగ మంత్రిగా వున్న, సోదరి సుష్మా స్వరాజ్‌ నొచ్చుకోకూడదు.)

వయసు : వయసుకీ ముచ్చటకీ సంబంధంలేదు. ఇరవయ్యవ పడిలో వేసిన దుస్తులే పదేపదే వేసేవాణ్ణి. ఈ అరవయ్యే పడిలో చూడండి గంటకో డ్రెస్‌తో మారుస్తున్నాను. ఈ డ్రెస్‌తో విమానం ఎక్కితే, అడ్రస్‌తో దిగాలని రూలు లేదు కదా?

వైర్ లెస్..!

చిన్న చిటికెన వేలు. ఎవరిదయినా కావచ్చు. కట్టుకట్టి వుంటుంది. గాయం ఎక్కడో వుంటుంది. కట్టు లోపలి, గాజు గుడ్డ లోపలి, దూది లోపలి, టింక్చర్‌ మరకల లోపల ఎక్కడో…! కనిపించనే కనిపించదు. కానీ తెగి వుంటుందన్న ఊహ; రెండు మూడు బొట్లు నెత్తురు కారి వుంటుందన్న ఎరుక! ఈ పిల్లెవరో ఏడ్చే వుంటుంది.

చీలిక మంచిదే… కోరిక తీర్చింది!

మరక మంచిదే… అన్నట్టుగా, విభజన మంచిదే అన అంటున్నారు. చిత్రం. ఈ మాటను ‘విభజన’ వాదుల కన్నా, ‘సమైక్య వాదులు’ అంటున్నారు. మరీ ముఖ్యంగా రెండు తెలుగురాష్ట్రాలలోని ఆర్టీసీ కార్మికులూ ఇదే మాట అంటున్నారు.
ఆర్టీసీ కార్మికులకు కష్టాలూ కొత్త కాదు, సమ్మెలూ కొత్త కాదు. గతంలో కూడా జీతాల పెంపు కోసం సమ్మెలు చేశారు. ఎప్పుడూ తమ డిమాండ్లు ప్రభుత్వం ముందు వుంచినా, కార్మికులే ఎక్కువగా దిగి రావాల్సి వచ్చేది

కాంగ్రెస్‌ ‘మానియా’!

పేరు : సోనియా గాంధీ

దరఖాస్తు చేయు ఉద్యోగం: ఉత్తమ మాతృమూర్తి (పిల్లల్ని ప్రయోజకుల్ని చేసిన తల్లిని ఈ దేశంలో ఇలా పిలుస్తారని తెలుసుకున్నాను. ఎంత సమయం పట్టినా సరే రాహుల్‌ గాంధీని ప్రయోజకుణ్ణి చేసి తీరతాను.)

వయసు : భారత స్వాతంత్య్రానికున్న వయసు కన్నా, నా వయసు తొమ్మిది నెలలు ఎక్కువ. అంతే.

ముద్దు పేర్లు : సో ‘నియంత’! ( నేను పార్టీలో ఎంత ప్రజాస్వామికంగా వున్నా- నియంత లా వున్నావు, నియంత లా వున్నావు- అని అంటే నాకు విసుకొచ్చి ‘సో.. నియంత నే!.. అయితే ఏమిటి?’ అని అనాలని కూడా అనిపిస్తుంది. కానీ నేను నిజంగానే ప్రజాస్వామ్యవాదిని కదా, అందుకనే అలా అనలేదు.),

సన్నాఫ్‌ ‘చంద్ర’ మూర్తి!

పేరు : నారా లోకేష్‌ బాబు

దరఖాస్తు చేయు ఉద్యోగం: ‘సన్‌ రైజర్స్‌’ టీమ్‌ కెప్టెన్‌.( క్రికెట్‌ గురించి కాదు, నేను పాలిటిక్స్‌ గురించే మాట్లాడుతున్నాను. ‘సన్‌ రైజర్స్‌’ అంటే ‘పొడుచు కొస్తున్న సూర్యులు’ కాదు, ‘తోసుకొస్తున్న కొడుకులు’. కావాలంటే ఈ టీమ్‌లో ‘కేటీఆర్‌’ కూడా చేరవచ్చు.)

వయసు :’ఎగిరే’ వయసే! అంటే తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ‘ఎగురుతున్నా’నని అపార్థం చేసుకునేరు…! అంటే ‘ఫ్లయ్‌’ చేసే ఈడొచ్చిందని. కాబట్టే… దేశదేశాల్లో ఫ్లయ్‌ చేస్తున్నాను.

‘దురద్‌’ యాదవ్‌!

పేరు : శరద్‌ యాదవ్‌

దరఖాస్తు చేయు ఉద్యోగం: స్త్రీ పక్షపాతి.( ఎందుకంటే, నేను స్త్రీలమీద చేసిన వ్యాఖ్యల్ని అపార్థం చేసుకుంటున్నారు. దక్షిణాది స్త్రీలు నల్లగా వున్నా, అందంగా వుంటారనీ, వారి దేహాలు ఎంత అందంగా వుంటాయో వారి అంతరంగాలు కూడా అంతే అందంగా వుంటాయనీ అన్నాను… తప్పా..?)

దొందూ దొందే!

అటు చంద్రుడు; ఇటు చంద్రుడు. ఇద్దరూ ఇద్దరే.

పేరులోనే కాదు, తీరులో కూడా ఇద్దరికీ పోలికలు వున్నాయి:

పూర్వ విద్యార్ధులు: చంద్రబాబే కాదు, కేసీఆర్‌ కూడా ఎన్టీఆర్‌ ట్రస్టులో చదువుకున్న వారే. ఎదురు తిరిగిన వారిని, ఎలా ‘కూర్చో’ బెట్టాలో తెలిసిన వారు. కొందరికి పదవులిచ్చి ‘కుర్చీలు’ వేస్తారు; ఎందరికో పదవులు ఇస్తామని ఆశ చూపి ‘గోడ కుర్చీ’లు వేస్తారు. దాంతో తమకి వ్యతిరేకుల్లో ఎవరూ’లేవరు’.

హ్యాంగ్‌ ‘రేప్‌ కల్చర్‌’!

చూసిందే చిత్రం కాదు, తలకిందులగా చూసింది కూడా చిత్రమే. అందుకేమరి. చిత్రాన్ని తియ్యటమే కాదు, చూడటం కూడా తెలియాలి. ఆలోచనలు తలకిందులు వున్నప్పుడు అన్నీ విపరీతంగా అనిపిస్తాయి. కాళ్ళతో చప్పట్లు కొడుతున్నట్లూ, చేతులతో పరుగెత్తుతున్నట్టు కూడా అనిపిస్తాయి. ఇప్పుడు దేశంలో ఈ వైవరీత్యం నడుస్తోంది.

పాపం ఆవిడెవరో దేశం కానీ దేశం నుంచి వచ్చి, మన దేశాన్ని కుదిపేసిన ‘నిర్భయ’ ఘటన మీద ఒక డాక్యుమెంటరీ తీశారు

కేసీఆర్‌ ‘భూ’ ప్రదక్షిణం!

వైయస్సార్‌ అంటే ‘నీరు’; కేసీఆర్‌ అంటే ‘భూమి’. అవును. (ఉమ్మడి) రాష్ట్రంలో వైయస్సార్‌ ముఖ్యమంత్రి కాగానే ‘జల యజ్ఞాన్ని’ చేపట్టారు. ఎక్కడికక్కడ సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని తలపెట్టారు. విపక్షాలు దీనిని ‘ధనయజ్ఞం’గా అభివర్ణించే వారు. ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయినది మొదలు ‘భూమి’ ‘భూమి’ అంటూనే వున్నారు. ఆయన దృష్టి అంతా ‘భూమి’ మీదనే పడింది. తొలుత అన్యాక్రాంతమయిన ‘గురుకుల్‌ ట్రస్టు’ భూముల మీద గురిపెట్టారు. ఆ భూముల నిర్మించిన కట్టడాలను కూలగొట్టటానికి సన్నధ్ధమయ్యారు. తర్వాత వరాలు ఇవ్వటంలో కూడా ‘భూ’భ్రమణం చేశారు. దళితులకు కుటుంబానికి మూడు ఎకరాల భూమిని ఇస్తానని వాగ్దానం కూడా చేశారు. అసెంబ్లీలోని బడ్జెట్‌ సమావేశాల ముగింపు సన్నివేశంలో కూడా కేసీఆర్‌ ను రక్షించింది మళ్లీ ‘భూమే’

‘యమ్‌’ పాల్‌!

పేరు : సంత్‌ రామ్‌పాల్‌

దరఖాస్తు చేయు ఉద్యోగం:’యమ్‌’పాల్‌ ( నా ఆశ్రమంలో కొస్తే మృత్యువును చూస్తారు.)

ముద్దు పేర్లు :’దేరా’ బాబా( నేను హర్యానాలో చేపట్టిన ఆధ్యాత్మిక సామాజిక ఉద్యమం లెండి.) కానీ నన్నిప్పుడు ‘డేరా’ పీకించేసి ‘డేరా బాబా’ను చేశారు.

‘విద్యార్హతలు :’ఐటిఐ’లో డిప్లమా. (ఐటిఐ- అంటే ఇండస్ట్రియల్‌ ట్రైనింగ్‌ ఇన్సిట్యూట్‌ అనుకుంటున్నారా? అబ్బే. ఇంటిలిజెంట్‌ టోకరా ఇన్సిట్యూట్‌. అందుకే నా ఆశ్రమంలో బోర్డు పెట్టాను. విరాళాలిచ్చే భక్తులు నేరుగా నాకే ఇమ్మంటాను. ఈ విషయంలో ఏ ‘వాల’ంటీర్‌నీ నమ్మను. ‘వాల’మంటేనే తోక- కదా! ఎలా నమ్ముతాను చెప్పండి.)

బడ్జెట్‌ అంకెలు: 3 అరుపులూ, 4 చరుపులూ!!

బడ్జెంట్‌ అంటే అంకెలూ కాదు, పద్దులూ కాదు! మరి? రంకెలూ, వీలయితే గుద్దులూ..! (కంగారు పడకండి. గుద్దుళ్ళూ అంటే, బల్ల గుద్దుళ్ళే లెండి.) బడ్జెట్‌ సమావేశాలను తిలకించవచ్చు. తెలుగు వారు ఒక్కరాష్ట్రంగా వున్నప్పుడూ, విడిపోయాక కూడా ఇదే తంతు. నెలల తేడాతో జరిగిన రెండు రాష్ట్రాల బడ్జెట్‌ సమావేశాల్లోనూ ఇదే ముచ్చట.

అయితే అరుపులూ, బల్లల చరువులూ అప్పటికప్పుడు పుట్టుకొచ్చిన ఆవేశకావేశాలనుంచి రావు. వీటన్నిటికీ కూడా ముందస్తు వ్యూహం వుంటుంది. ఫలానా సభ్యుడు ఊరికే నోరు జారాడూ అంటారు కానీ, అది నిజం కాదు. ‘ఊరక (నోరు) జారరు మహానుభావులు’. దానికో ప్రయోజనం వుంటుంది.