
రాజకీయంగానూ, పారిశ్రామికంగానూ అగ్రభాగాన వున్న వారే ఈ ‘ఆదర్శాన్ని’ పాటిస్తున్నారు. కానీ మధ్యతరగతి వారు సరసమైన కట్నానికి సాటి కులస్తుడు దొరికే వరకూ ఎదురు చూస్తున్నాడు. ‘ఆదర్శం’ కూడా ఖరీదయినదే. అది సంపన్నులకే అందుబాటులో వుంటోంది.
ప్రజాస్వామ్యం కూడా నలుగు రంగులు వుంటాయి. అది కూడా ఒక రకంగా చూస్తే చాతుర్వర్ణ వ్యవస్థే. శాసన శాఖ ‘పచ్చ’గా వుంటుంది. అక్కడికి గెలిచి వచ్చేది ‘పచ్చ’ నోట్లతోనే కదా! న్యాయశాఖ నల్ల గా వుంటుంది. న్యాయవాదులూ, న్యాయమూర్తులు వేసుకునే (కొందరి విషయంలో జేబులో వేసుకునే) ‘కోట్ల’ సాక్షిగా ‘నల్ల’గా వుంటుంది. మరి ‘మీడియా’? ఏ రంగులో చూస్తే ఆరంగులో కనిపిస్తుంది. ఇంతకీ ప్రజాస్వామ్యం కీలకమైన ‘కార్యనిర్వాహక’ వాఖ (గవర్నమెంటు) ఏ రంగులో వుంటుంది? ఈ ప్రశ్న సాధారణ పౌరుణ్ణి అడగాలి. తడుముకోకుండా ‘ఖాకీ’ రంగులో వుంటుందని చెబుతాడు.
Amid rumoured certainty of the change of the guard in AP, the name of a leader, who has been seldom talked about, has taken dramatic precedence to all other familiar aspirants. He is none other than Marri Sashidhar Reddy. He has been away from all the feuds with in the congress, at least, after the demise of Y.S. Rajasekhara Reddy, whom he was opposed to.
కఠినంగా ఏది కనిపించినా మనం ఊరుకోం. కొబ్బరి పెంకును బద్దలు కొట్టి మెత్తని తెల్లదనాన్ని చూస్తాం. రాయి కఠినం. చెక్కేసి ఒక సుకుమారిని చేసేస్తాం. ప్రపంచమంతా పైకి కఠినమే. పై కవచాన్ని తొలిచేస్తే లోన పసిపాపే. అప్పడు భూగోళాన్ని ఒళ్ళోకి తీసుకోవచ్చు. అరమరికలు మరచి ముద్దాడ వచ్చు. ఈ భోగం ఒక కవి కి తెలుస్తుంది. తప్పితే తెలిసేది కళాకారుడికే.
నేడు స్నేహ దినోత్సవం.స్నేహానికి నిర్వచనం చెప్పాల్సి వచ్చినప్పుడెల్లా సినిమా రంగం నుంచి ‘బాపు-రమణ’లను ఉదహరించేవారు. కానీ వైయస్ తొలిసారిగా ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మరో ఉదాహరణ రాజకీయ రంగంనుంచి దొరికేసింది. ‘వైయస్-కె.వి.పి’లను ఆ రీతిలో కీర్తించటం మొదలు పెట్టారు.( వారికి ఇలాంటి స్నేహం దశాబ్దాల నుంచీ వుండవచ్చు. కానీ ఆ విషయం లోకానికి కాస్త అలస్యంగా తేటతెల్లమయింది.) ముఖ్యమంత్రి అయ్యాక ఆయనతో ఎప్పుడూ రెండు పాత్రలు కనిపిస్తుండేవి. ఒకటి ‘ఆత్మ’, రెండు ‘నీడ’. ఆత్మ- కె.వి.పి రామ చంద్ర రావు అయితే, నీడ-సూరీడు. కానీ పాపం. వైయస్ చివరిసారిగా హెలికాప్టర్ ఎక్కినప్పుడు మాత్రమే ‘ఆత్మ’నీ, ‘నీడ’నీ వదలేశారు.
పేరు : కె.పార్థ సారధి
దరఖాస్తు చేయు ఉద్యోగం: అంత ఆశ లేదు. ఉన్న ఉద్యోగం(రాష్ట్ర మాధ్యమిక విద్యా శాఖామంత్రి పదవి) ఊడకుండా వుంటే చాలు. (రెండేళ్ళ శిక్ష పడింది. నిజమే. రెండేళ్ళ పదవీ కాలం కూడా వుంది.)
ముద్దు పేర్లు : ‘ఫెరా’సారధి, పార్థ ‘ఫెరా’రథి. ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ (ఫెరా) ఉల్లంఘించాననే శిక్ష వేశారు లెండి. (రాజీనామా చేయకుండా పదవినే అంటి పెట్టుకుని వుంటున్నానని కిట్టని వారు కొందరు -‘స్వార్థ’ సారధి అంటున్నారు లెండి. నా అనుచరులయితే ఇప్పటికీ నన్ను ‘నిస్వార్థ’ సారధి అంటారు)
రాష్ట్రంలో ‘అకాల’ జ్ఞానులు పెరిగిపోతున్నారు. అడక్కపోయినా, ఆపి మరీ జోస్యం చెప్పేస్తున్నారు. చంద్ర శేఖర సిధ్ధాంతి (కె. చంద్రశేఖరరావు) హఠాత్తుగా వచ్చే నెలలో(సెప్టెంబరులో) తెలంగాణ తేలిపోతుందంటారు. ఈయనకు గతంలో కూడా ఇలాంటి జ్యోతిషం చెప్పిన అనుభవం వుంది. కానీ ఆంధ్ర నుంచి, ఇంకో సిధ్ధాంతి బయిల్దేరారు. ఆయనే రామచంద్ర సిధ్ధాంతి( గుడుల మంత్రి సి.రామచంద్రయ్య). చిరంజీవి ముఖ్యమంత్రి అవుతారని ద్వారాకా తిరుమలలోని ‘కాపు కళ్యాణమంటపం’లో చెప్పారు. వీరు హాస్యాలాడుతున్నారా? లేక జోస్యాలాడుతున్నారా? రాజకీయాల్లో రెంటికీ పెద్ద తేడా ఏమీ వుండదు లెండి.
ఒకప్పుడు ‘సమైకాంధ్ర’ నినాదమిచ్చిన సీమాంధ్ర నేతలెవరూ, తెలంగాణ గడ్డ మీద కేసీఆర్‌కు ఎదురు నిలువ లేదు. ఆ మాట కొస్తే ఉద్యమం ఉధ్ధృతం అయ్యాక కాలు కూడా మోప లేదు. అలాంటిది- ఒకప్పుడు ఇదే కారణం మీద మహబూబా బాద్ నుంచి వెనుతిరిగిన వై.యస్ జగన్, తన తల్లి(విజయమ్మ)నీ, చెల్లి(షర్మిల)నీ తెలంగాణ ఉప ఎన్నికకు ప్రచారానికి పంపిస్తే, కేసీఆర్ చోద్యం చూశారు. అంతే కాదు, పరకాలలో వైయస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ, టీఆర్‌ఎస్ అభ్యర్థికి ‘నువ్వా-నేనా’ అన్నంతటి పోటీ ఇచ్చి ముచ్చెమట్లు పోయించారు. స్వల్ప ఆధిక్యంతో టీఆర్‌ఎస్ పరువు నిలుపు కున్నది కానీ, పట్టు కోల్పోయింది.
అదేమిటో కానీ, గట్టెక్కిన వాడు నీళ్ళలో వున్న వాడికీ; పై మెట్టు మీద వున్న వాడు, కింద మెట్టు మీద వున్న వాడికీ- పాఠం చెప్పేయాలని తెగ ఉత్సాహపడిపోతాడు. సంపన్నుడు మధ్య తరగతి వాడికీ; మధ్య తరగతి వాడు, పేదవాడికీ ఇలా నీతిని బోధించాలని తెగ ఉబలాట పడిపోతారు. ఈ మధ్య కాలంలో మధ్యతరగతి వారి ఉత్సాహం కట్టలు తెంచేసుకుంటోంది. ఏ ఐటీ చదువో వెలగబెట్టి, అంతకు తగ్గ కార్పోరేటు కొలువు పట్టేస్తే చాలు- కింద వారికి చెప్పడానికి నీతి కథలు తన్నుకుంటూ వచ్చేస్తాయి. అలాంటి నీతి పాఠాల్లో, తొలి నీతి పాఠం- ‘అవినీతి పాఠం’.
‘కుటుంబ నియంత్రణ పాటించాలయ్యా?’
‘నాకున్నది ఇద్దరే కదా సర్!’
‘నేనడిగేది పిల్లల గురించి కాదు, కుటుంబాల గురించి.’
‘అయతే… మూడండి.’
ఈ సంభాషణ ఓ అధికారికీ, ఆయన కింద పనిచేసే ఉద్యోగికీ మధ్య జరిగింది.
నిజమే ఒక్కొక్కరూ పెద్దిల్లు కాకుండా చిన్నిల్లూ, బుల్లిల్లూ, చిట్టిల్లూ- ఇలా పెట్టుకుంటూ పోతుంటే, ‘కుటుంబాలు’ పెరిగిపోవూ? అవును కుటుంబాలంటే, పిల్లలు కాదు, భార్యలే.
పేరు : ప్రణబ్ ముఖర్జీ
దరఖాస్తు చేయు ఉద్యోగం: క్రియాశీల రాష్ట్రపతి( కలామ్, ప్రతిభాపాటిళ్ళు ‘నామమాత్రపు’ రాష్ట్రపతుల్లాగానే వున్నారు.) రాష్ట్రపతి పదవి వచ్చింది కానీ, తర్వాత మెట్టు ఇదే.
ముద్దు పేర్లు : ‘దా’.. ‘దాదా’.. ‘రణ’బ్ ముఖర్జీ( రణం చేస్తాను కానీ, రాజీ పడి, ‘రబ్బర్ స్టాంపు’ గా మారి ‘ప్రణబ్బర్’ ముఖర్జీ అని పించుకోను.)
విద్యార్హతలు : మాస్టర్ ఇన్ ట్రబుల్ షూటింగ్( కాంగ్రెస్ గడ్డుకాలంలో వున్నప్పుడెల్లా గట్టెక్కించే వాడిని.. ఆ పార్టీ గడ్డుకాలంలో లేనిదెప్పుడు లెండి!)