చిన్న చిటికెన వేలు. ఎవరిదయినా కావచ్చు. కట్టుకట్టి వుంటుంది. గాయం ఎక్కడో వుంటుంది. కట్టు లోపలి, గాజు గుడ్డ లోపలి, దూది లోపలి, టింక్చర్ మరకల లోపల ఎక్కడో…! కనిపించనే కనిపించదు. కానీ తెగి వుంటుందన్న ఊహ; రెండు మూడు బొట్లు నెత్తురు కారి వుంటుందన్న ఎరుక! ఈ పిల్లెవరో ఏడ్చే వుంటుంది.
Tag: ప్రేమ
ఒక గ్రాము ప్రేమ
ఏమిటో. ఇలా అనుకోవటం పాపం, అలా జరిగిపోతుంది. సరిగ్గా చిట్టి చేపను చూసి వల
వేస్తుంటాడతడు. పిచ్చిచేప పిల్ల పారిపోతే బాగుండునూ అనుకుంటాను. అది అనుకున్నట్టే
తుర్రుమంటుంది. అదేదో చానెల్లో లేడిపిల్లని పులి వేటాడుతుంటుంది. దగ్గరవరకూ వచ్చేస్తుంది. పులి
ఆగిపోతే బాగుండుననుకుంటానా, సరిగ్గా అదే సమయానికి దాని కాలికి రాయి తగిలి బోర్లా
పడుతుంది. లేడి పిల్ల తప్పుకుంటుంది. ఇలా ఎలా జరిగిపోతోంది? ఏదయినా అతీత శక్తా? అవును.
దాని పేరే ప్రేమ.
పిడికెడు గుండె!
శత్రువు లేని వాణ్ణి నమ్మటం కష్టం. శత్రువు లేని వాడికి మిత్రులు కూడా వుండరు. నా ఇష్టాలూ, నా అభిప్రాయాలూ, నా తిక్కలూ వున్న వాళ్ళే నాకు మిత్రులవుతారు. నా మిత్రులకు పడని వాళ్ళంటే నా అభిప్రాయాలు పడని వాళ్ళే. శత్రువు లేని వాడంటే ఒకటే అర్థం- సొంత అభిప్రాయం లేనివాడని. అందుకే అజాత శత్రువు(ధర్మరాజును) సొంత ఆలి కూడా నమ్మదు. ఏదో ఒక రోజు-‘నన్నోడి తన్నోడెనా, తన్నోడి నన్నోడెనా?’ అని అడుగుతుంది. పగపట్టటం చేతకాని వాడికి, ప్రేమించటమూ రాదు.