
గుడ్డొచ్చి ప్రతీసారీ పిల్లను వెక్కిరించదు. ఒక్కొక్కసారి రక్షిస్తుంది. తాతకు దగ్గుల్నే కాదు, పెగ్గుల్ని నేర్పించే మనుమలుంటారు. తండ్రిని మించిన .. కాదు,కాదు, తండ్రిని పెంచిన తనయులు కూడా వుంటారు. ఉత్తరప్రదేశ్లో ములాయం పరపతిని, అఖిలేష్ అలాగే పెంచారు. భారత రాజకీయాలకు కొడుకులూ కొత్త కాదు, కూతుళ్ళూ కాదు. కానీ ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వచ్చాక, పేరుమోసిన రాజకీయ నేతలు ఒక్కసారి ఇళ్ళల్లోకి చూసుకున్నారు.