Tag: వంటింటి కుందేలు

‘ఆలి‘ ఖైదాలు!

సూర్యరశ్మి సోకకుండా అత్యంత సుకుమారంగా అంత:పురాలలో వుండే స్త్రీలను అసూర్యంపశ్యలని అని అనేవారు. మహిళలకు భద్రత చాలు, స్వేఛ్చ ఎందుకనే రోజులవి. కానీ పరదాలను దాటుకుని రావటానికి ఆరాటపడుతూనే వున్నారు. వారు బయిటకు వచ్చి అన్ని రంగాలలోనూ తమ ఉన్నతిని చాటుకుంటున్నా, ఈ సూర్యుడనేవాడు ఇంకా వెంటాడుతూనే వున్నవాడు. దాంతో అతణ్ణి మాత్రమే తప్పించుకోవటానికి వారు ముసుగులు ధరించి ‘ఉగ్ర‘వాదులు గా మారణం తప్పటం లేదు. పురుషాధిపత్యం మీద కూడా ఏదో ఒక నాడు వారు నిజంగానే ఈ ‘ఉగ్ర’ రూపం దాల్చక తప్పదేమో.