మరక మంచిదే… అన్నట్టుగా, విభజన మంచిదే అన అంటున్నారు. చిత్రం. ఈ మాటను ‘విభజన’ వాదుల కన్నా, ‘సమైక్య వాదులు’ అంటున్నారు. మరీ ముఖ్యంగా రెండు తెలుగురాష్ట్రాలలోని ఆర్టీసీ కార్మికులూ ఇదే మాట అంటున్నారు.
ఆర్టీసీ కార్మికులకు కష్టాలూ కొత్త కాదు, సమ్మెలూ కొత్త కాదు. గతంలో కూడా జీతాల పెంపు కోసం సమ్మెలు చేశారు. ఎప్పుడూ తమ డిమాండ్లు ప్రభుత్వం ముందు వుంచినా, కార్మికులే ఎక్కువగా దిగి రావాల్సి వచ్చేది
Tag: చంద్రబాబు నాయుడు
బాబు ‘గ్రహ’ స్థితి మారిందా?
ఆంధ్రప్రదేశ్‌లో ఎవరు గ్రహం? ఎవరు ఉపగ్రహం? బీజేపీ, తెలుగుదేశం పార్టీల విషయంలో పరిశీలకులకు కలుగుతున్న సందేహమిది. రెంటి మధ్యా ‘వియ్యమూ’ కొత్త కాదూ, ‘విడాకులూ’ కొత్త కాదు. ఇంతకు ముందు కూడా బీజేపీతో తెలుగుదేశం పార్టీ కలిసి ‘కాపురం’ చేసింది. తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్టీరామారావు బీజేపీని పూర్తిగా దూరం పెట్టినా, ఆ తర్వాత పార్టీ పగ్గాలు అందుకున్న చంద్రబాబు నాయుడు మాత్రం బీజేపీతో ‘దాగుడు మూతలు’ ఆడుతూనే వున్నారు. ఆయనకి ఈ పార్టీ ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క విధంగా కనిపిస్తుంది.
‘సమైక్య’ బరిలో మూడు పందెం కోళ్ళు
సమైక్యాంధ్ర ఛాంపియన్షిప్ ట్రోఫీ ఎవరికి దక్కబోతోంది! ఇప్పుడు నిజంగా అసెంబ్లీలో ( జనవరి 23 వరకూ) నడుస్తున్నది ఈ పోటీయే!
చర్చ జరుగుతున్నది ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు మీదనే. ఈ బిల్లు చర్చకు రావటం వల్ల తెలంగాణ ప్రాంతానికి ఏ మేరకు ప్రయోజనం వుందో తెలియదు కానీ, సీమాంధ్ర శాసన సభ్యులకు మాత్రం ఇది చాంపియన్‌షిప్‌కు జరుగుతున్న పోటీలాగే అనిపిస్తోంది.
‘గ్లాసు’ జారి, ‘ఒళ్ళం’తయ్యిందే..!
గ్లాసే కదా- అని కొట్టి పారెయ్యలేం. ఒక్క గ్లాసు తో మనిషి తూలిపోవటం మామూలే. కానీ అదే గ్లాసుతో రాజ్యాలకు రాజ్యాలే కూలిపోయాయి. మన కళ్ళముందే 1994లో రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు కూలిపోయింది. అవును. సారా గ్లాసుతోనే.
దాంతో గ్లాసుల్లేని రాజ్యాన్ని తెస్తానని ఎన్టీఆర్ భీషణ ప్రతిజ్ఞచేసి, మరో మారు గద్దెనెక్కారు. అనుకున్నట్టుగా ప్రమాణ స్వీకారం రోజునే తొలి సంతకం మీద ‘గ్లాసు బోర్లించారు’. మద్య నిషేధాన్ని అమలులోకి తెచ్చారు.
సిఎం సీటు ‘బీసీ’కా? ‘సీబీ’కా?
వంద సీట్లు. వెయ్యి కోట్లు. లక్ష ఫీట్లు.
ఇవీ బీసీల వోట్ల కోసం చంద్రబాబు పాట్లు.
ఇది విజన్ 2020 కాదు, రీజన్ 2014.
అనుమానం లేదు. ఇది ఎన్నికల గణితమే. ఆయన లెక్కల్లో మనిషి. ఇంతకు ముందు ఎన్నికల్లో ఇలాగే ‘నగలు బదలీ’ లెక్కలు వేశారు. ‘ఆల్ ఫ్రీ’ కూడికలు వేశారు. కానీ జనానికి ‘తీసివేత’లే అర్థమయ్యాయి. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ‘తీసి వేశారు’.
‘ఉప’ సమరంలో చంద్ర బాంబులు!
మొన్న అవినీతి!
నిన్న మతం!
నేడు నేరం!
అన్నీ బాంబులే! ‘చంద్ర బాంబులే’! జగన్ మీద విసిరిన ‘దీపావళి’ బాంబులే!
ఒక్కటీ పేలలేదు. అన్నీ తుస్సుమన్నాయి.
ఇంకేం చేస్తారు?
పాత పాటే. ‘ఆల్ ఫ్రీ’! బియ్యం ఉచితం! నిరుద్యోగులకు నెలకు వెయ్యి. ఇలాంటి హామీలు ఇచ్చేస్తానంటున్నారు. ఇదేదో ఉపకార వేతనం అనుకునేరు! ‘ఉప’ ఎన్నికల వేతనం.