అవును. నాకు నేనే దొరకను. నాలాగా వున్ననేనుతో నాకు పనివుండదు. ఉత్తినే వానలో తడవాలనీ,
ఇసుకలో ఆడాలనీ, దొంగచాటుగా చెట్టునుంచి పచ్చి మామిడికాయ కొట్టుకొచ్చి, పచ్చికారం, ఉప్పూ కలుపుకుని
తినాలనీ ఉంటుందా? సరిగా అప్పడే, మెక్ డొనాల్డ్స్ల్ లో దూరి బర్గర్ తిని, నేను కాని నేనుగా తిరిగి వస్తా. ఎవర్నయినా
గాఢంగా కౌగలించుకోవాలని, కేవలం కరచాలనంతో తిరిగి వచ్చినప్పడు, నా ముఖం నాకే నచ్చదు. మీకేం చూపను?