తెలుగు రాష్ట్రాలు వేరయినా, ఒక రాష్ట్రంలోని రాజకీయాల ప్రభావం మరొక చోట పడుతూనే వుంది. నాలుగేళ్ళ తర్వాత ఈ ముద్ర మరింత పెరిగింది. ప్రాంతీయ వైరాలు- నేతల్లో సరేసరి- ప్రజల్లో తగ్గాయి. రాష్ట్రం ‘సమైక్యం’గా వున్నప్పటి అపోహలు ‘వేరు పడ్డాక’ తగ్గాయి. కాపురాలు వేరయ్యాక కలయకలు పెరిగాయి. తెలంగాణ కాస్త ముందుగా ఎన్నికలకు వెళ్ళటంతో ఈ…
Tag: బీజేపీ
‘అమితా’శలపై తెలుగు నీళ్ళు..?
అణచుకుంటే అణిగేదీ, తీర్చుకుంటే తీరేదీ కోరిక కాదు. ఆ తర్వాత పెరుగుతుంది, చచ్చినట్టే చచ్చి తిరిగి పుడుతుంది. అందుకే కాబోలు- అటు అణచటం, ఇటు తీర్చుకోవటమూ కాకుండా- కోరికను జయించ మన్నాడు బుద్ధుడు. కాంక్షలన్నిటిలోనూ పెద్ద కాంక్ష రాజ్యకాంక్ష. ఇది ఒక పట్టాన తీరదు. రాచరికాలు పోయినా, ప్రజాస్వామ్యం వచ్చేసినా రాజ్యమేలాలనే కాంక్ష పదిలంగా వుంది.…
‘వంక’ల నాయుడు!
దరఖాస్తు చేయు ఉద్యోగం: ‘ప్రత్యేక హోదా’ (నాకు కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి) ఎన్డీయే సర్కారు అధికారంలోకి రానప్పుడు, యూపీయే అధికారంలో వున్నప్పుడు దరఖాస్తు చేశాను. ఇప్పుడు ఎన్డీయే సర్కారు అధికారంలో వుంది. ‘ఇచ్చే హోదా’ లో వున్నాను, కానీ ‘రూల్సు’ అడ్డు వస్తున్నాయి.
వయసు : ‘పెద్ద’ వాణ్ణే. ఎప్పడూ ‘పెద్దల సభ’ నుంచే వచ్చే వాణ్ణి కదా! కానీ అయనా ఏం లాభం? ‘హౌస్’ ను ..ఐ మీన్ … సభను చక్కదిద్ద లేక పోతున్నాను. పైపెచ్చు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిని కదా!
ముద్దు పేర్లు : ‘వంక’ల నాయుడు ( నేనేం నిజం చెప్పినా ప్రతిపక్షాల వారికి ‘వంక’ చెబుతున్నట్టుంది. ప్రత్యేక హోదా ఇవ్వటానికి ‘ఆర్డినెన్స్’ సరికాదు… అందుకు పార్లమెంటు సమ్మతి కావాలంటే వినరే!)
‘పవర్’ లిఫ్టర్!
పేరు : కన్నా లక్ష్మీనారాయణ
దరఖాస్తు చేయు ఉద్యోగం: ఇంకేం ఉద్యోగం? ‘కాషాయం’ కట్టేశాను. ఐమీన్ భారతీయ జనతా పార్టీలో చేరిపోయాను. కాంగ్రెస్‌తో నాలుగుదశాబ్దాల అనుబంధానికి గుడ్‌బై కొట్టేశాను.
ముద్దు పేర్లు :’పవర్’ లిఫ్టర్( విద్యార్థిగా వుండగా ‘వెయిట్ లిఫ్టింగ్’ చేసేవాణ్ణి. ఆ అనుభవంతోనే రాజకీయాల్లోకి చేరాను. పాలిటిక్స్ అంటే ‘పవర్ లిఫ్టింగే’ కదా! కాంగ్రెస్‌లో వున్నన్నాళ్ళూ ‘పదవుల్ని ఎత్తుతూనే వున్నాను’ ( నేదురుమిల్లి జనార్థన రెడ్డి, వైయస్, రోశయ్య, కిరణ్‌కుమార్ కేబినెట్లలో మంత్రిగా పనిచేస్తూనే వున్నాను.) కానీ ఈ ఏడాది ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో జనమే కాంగ్రెస్‌ను ‘లిఫ్ట్’ చేసి పడేశారు.
‘కమలం’బాటి పురంధేశ్వరి
పేరు : దగ్గుబాటి పురంధేశ్వరి
దరఖాస్తు చేయు ఉద్యోగం: ‘కాషాయ’ మంత్రి (‘ఖద్దరు’ మంత్రిగా చేసేశాను. ఇక చేయాల్సింది అదే కదా! ‘అన్న’ కూతురుగా అన్ని సార్లూ సెక్యులర్ పార్టీలోనే మంత్రి పదవి చేయాలని లేదు.)
ముద్దు పేర్లు :రాజకీయ ‘దురంధేశ్వరి'( బాపట్ల అసెంబ్లీ స్థానం నుంచి, విశాఖపట్నం పార్లమెంటు స్థానానికి ఎంత సునాయాసంగా రాగలిగానో, కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి కూడా అంతే సులువుగా వచ్చాను.) ‘కమలం’ బాటి పురంధేశ్వరి
‘నెలవంక’య్య నాయుడు
పేరు : ఎం.వెంకయ్య నాయుడు
దరఖాస్తు చేయు ఉద్యోగం: ‘సీమాంధ్ర చాంపియన్-4’ ( మొదటి మూడు స్థానాలు నిండిపోయాయి. జగన్, కిరణ్, బాబులు వాటిని సాధించారు. అయినా సరే, ప్రయత్నిస్తే ఎప్పుడోకప్పుడు మొదటి స్థానానికి చేరక పోతామా- అన్నది పట్టుదల)
ముద్దు పేర్లు : ‘నెల వంక’య్య నాయుడు.( అవును. నెలవంక అంటే ‘చంద్రుడే’. తెలుగు ‘చంద్రుడే’. బీజేపీతో తెలుగుదేశం పొత్తు పెట్టుకోవాలనుకున్నప్పుడెల్లా, చంద్రాబునాయుడుతో మాట్లాడటానికి, వెంకయ్య నాయుడు- అను నాతో పని వుంటుంది కదా)
‘కాంగ్రేజీ’ వాల్!
పేరు :కేజ్రీవాల్
దరఖాస్తు చేయు ఉద్యోగం: అర్థాంతరపు ముఖ్యమంత్రి
ముద్దు పేర్లు : ‘కాంగ్రేజీ’ వాల్ (కాంగ్రెస్‌తో ‘చెయ్యి’ కలిపాను కదా!), ‘ముప్పావు కేజీ’ వాల్ (ఇంక్కొక్క పావు కేజీ (ఎనిమిది) సీట్లు వచ్చి వుంటే, నా అంతట నేనే, ఢిల్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేవాడిని.
విద్యార్హతలు : మొన్నటి వరకూ ‘ఐఆర్ఎస్'( ఇండియన్ రెవెన్యూ సర్వీస్), నేటి నుంచి ‘ఐ డబ్ల్యూ ఎస్’ (ఇండియన్ వాటర్ సర్వీస్), ప్రతీ ఇంట్లో ‘ఏడు వందల బాల్చీల(లీటర్ల) నీళ్ళు’ పోద్దామనుకుంటున్నాను. (ఇవ్వక పోతే ముఖ్యమంత్రిగా నేనే బాల్చీ తన్నాల్సి వుంటుంది.)