వేరే గ్రహం నుంచి భూమ్మీదకు దిగి, వెతుక్కుంటూ, వెతుక్కుంటూ భారత దేశం వచ్చిన ‘పీకే'(అమీర్ ఖాన్), ఈ దేశంలో తప్ప ఎక్కడయినా వుంటానంటున్నాడా? ఆ సినిమాలో అన్ని మత ఛాందసాలకూ, సమానంగా తలంటు పోసిన అమీర్ పట్ల, ఒక మతానికి చెందిన ఛాందసులే ‘అసహనం’ ప్రదర్శించారా? ఇంతకీ దేశం వెళ్ళాలనే ఆలోచన ఆయనకు వచ్చిందా? లేక హిందువుగానే పుట్టిన తన భార్య(కిరణ్)కు వచ్చిందా?
Tag: వెంకయ్య నాయుడు
సుష్మా ‘హిందూ’ రాజ్!
పేరు : సుష్మా స్వరాజ్
దరఖాస్తు చేయు ఉద్యోగం: తొలి మహిళా ఎన్డీయే ప్రధాని అభ్యర్థిని( వెంటనే కాదు లెండి. సార్వత్రిక ఎన్నికలు జరగాలి. అత్యధిక సీట్లు సాధించిన ఏకైక కూటమిగా ఎన్డీయే నిలవాలి. అయినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి ఇంకా డెభ్యయ్యో, ఎనభయ్యో సీట్లు తక్కువ కావాలి. అప్పుడు ప్రాంతీయ పార్టీలు నరేంద్రమోడీ ప్రధాని అభ్యర్థిత్వాన్ని నిరాకరించాలి. అప్పుడు మహిళ ప్రధాని కావాలి-అని దేశమంతటా ఉద్యమం తేవాలి. అప్పుడు మనకి ఛాన్స్ వుంది. అయితే నేను ప్రధాని అయితే, గుండు గీయించుకుంటాను అని ఏ కాంగ్రెస్ మహిళా నేతా శపథం మాత్రం చెయ్యకూడదు. ఎందుకంటే, 2004 లో సోనియాని ప్రధానిని చేస్తారని అనుకున్నప్పుడు, నేను అలాంటి శపథమే చేశాను లెండి.)
‘నెలవంక’య్య నాయుడు
పేరు : ఎం.వెంకయ్య నాయుడు
దరఖాస్తు చేయు ఉద్యోగం: ‘సీమాంధ్ర చాంపియన్-4’ ( మొదటి మూడు స్థానాలు నిండిపోయాయి. జగన్, కిరణ్, బాబులు వాటిని సాధించారు. అయినా సరే, ప్రయత్నిస్తే ఎప్పుడోకప్పుడు మొదటి స్థానానికి చేరక పోతామా- అన్నది పట్టుదల)
ముద్దు పేర్లు : ‘నెల వంక’య్య నాయుడు.( అవును. నెలవంక అంటే ‘చంద్రుడే’. తెలుగు ‘చంద్రుడే’. బీజేపీతో తెలుగుదేశం పొత్తు పెట్టుకోవాలనుకున్నప్పుడెల్లా, చంద్రాబునాయుడుతో మాట్లాడటానికి, వెంకయ్య నాయుడు- అను నాతో పని వుంటుంది కదా)