Tag: Ambedkar

అక్కడ ‘జస్ట్‌ మెర్సీ’! ఇక్కడ ‘జై భీమ్’!!

అవసరాల మధ్యనే జీవిస్తుంటాం. అవసరాలు తీర్చుకోవటమే జీవిస్తుంటాం. తిరిగి అవసరాలను అన్వేషిస్తూనే జీవిస్తుంటాం.చెయ్యటానికో ఉద్యోగం, ఉండటానికో ఫ్లాటూ, తిరగటానికో కారు. తోడుకో సహచరీ లేదా సహచరుడూ, గొప్పలు పోవటానికి పిల్లలూ, వాళ్ళ ప్రాగ్రెస్‌ రిపోర్టులూ.. ఇవన్నీ అవసరాలే.ఇన్ని అవసరాల్లోనూ ఆవేశం కూడా అప్పుడప్పుడూ అవసరమయిపోతుంటుంది. దీనిని తీర్చిపెట్టటానికి కోట్లకు పడగలెత్తే వినోద పరిశ్రమ వుంటుంది. ఎప్పుడు…

నిజం నాకు తెలుసు – నెపం నగ్నముని మీదకి!

ఒక జలప్రళయం ముగిశాక, సమస్త సృష్టీ సర్వనాశనమయ్యాక, నీటమునిగిన నేలతల్లి తేరుకున్నాక, ఒక వెలుగు కిరణం తొంగిచూశాక నోవహు తన ఓడనుంచి ఒక పిట్టను వదలుతాడు. ఒక పచ్చని మొక్క మొలకెత్తిన జాడను పిట్ట ముందుగా కనిపెడుతుంది. ఆ ‘వెలుతురు పిట్టే’ కవి. (ఈ మాటనిచ్చిన కవి మిత్రులు శ్రీమన్నారాయణ గారికి కృతజ్ఞతలు) అదే జలప్రళయం…

మాటలో పాగా!

ఒక్కడే. మాట్లాడతాడు. తనలో తాను కాదు. తన ముందున్న వారితో. తనకు దూరంగా వున్నవారితో. వందలు, వేలు, లక్షలు, కోట్ల మందితో! అప్పుడు మాట మంత్రం కాదు. మాధ్యమం. మాధ్యమం మారణాయుధమూ కాగలదు. మృత సంజీవినీ కాగలదు. అక్షరం చేసి ముద్రించినా, శబ్దం చేసి వినిపించినా, దృశ్యం చేసి చూపించినా, లేక ముద్రిత శబ్దచలనచిత్రంగా మార్చి…

ఎవరెస్టు పై ఎవరెస్టు

భూగర్భాన్నీ, గగనతలాన్నీ, కడలి కడుపునీ తడిమి చూడగల మానవుడికి, ఇంకా తనకూ తన తోటిమానవుడికీ మధ్య దూరాన్నిెెఎలా లెక్కించాలో తెలియటం లేదు. రోదసి లో గ్రహానికీ గ్రహానికీ వున్నంత దూరమా? మనిషే సాటి మనిషిని చేరాలంటే ఇంకా ఎన్ని కాంతి సంవత్సరాలు ప్రయాణించాలో? తెల్లవాడు నల్లవాడికి చేరువ కావటానికి యుగాలు పట్టింది. ఇంకా ఈ పుణ్యభారతంలో ఊరు, వెలివాడను చేరనే లేదు. మెదానం అరణ్యాన్ని తాకనేలేదు. అయినా వాడబిడ్డ, అడవి పుత్రికా హిమశిఖరాన్ని తాక గలిగారు