సెప్టెంబరు 30, 2012 .ఇది తేదీ కాదు. ముహూర్తం. సాక్షాత్తూ ‘చంద్రశేఖర సిధ్దాంతి’ పెట్టిన అనేకానేక ముహూర్తాల్లో ఇది ఒకటి. ఆయన లెక్క ప్రకారం ఈ తేదీ లోగా తెలంగాణ సమస్యకు ‘శుభం’ కార్డు పడిపోతుంది. ఆయన ప్రత్యేక ‘పంచాంగం’లో ఇలాంటి తేదీలు ఇంతకు ముందు చాలా గడచిపోయాయి. అయితే ముహూర్త బలాన్ని ఏమాత్రం శంకించాల్సిన పనిలేదు. ఎటొచ్చీ ఆయన ముహూర్తం పెట్టే వాడే తప్ప, శుభకార్యం జరిపించే వాడు మాత్రం కాదు.