
రమ్య హత్య కేవలం ఎప్పుడూ జరిగే ‘ప్రేమోన్మాద’ హత్య మాత్రమే కాదు; ‘కులోన్మాద’ హత్య కూడా. ‘ప్రేమోన్మాది’ ఆడపిల్లను ‘వస్తువు’గానే చూస్తాడు. ‘కులోన్మాది’ బానిసగా కూడా చూస్తాడు. వెరసి, కోరుకుంటూ వచ్చి ఒళ్లో వాలే ‘చవకబారు వస్తువు’గా చూస్తాడు. రమ్య దళిత యువతి.