‘మావాణ్ని ఏ కార్పోరేట్స్కూల్లో వేస్తే మంచిదంటావ్?’
ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు, సాటి ఉపాధ్యాయుడి సలహా కోరతాడు.
‘మా ఆవిడకు రెండు రోజులనుంచి జ్వరం, ఏ మల్టీ స్పెషాలిటీస్ హాస్పటల్లో చేర్పిస్తే మంచిదంటావ్?’
ప్రభుతాసుపత్రిలో డాక్టరు, తోటి డాక్టరుని ఆరా తీస్తాడు.
‘మా అల్లుడు కట్నం కోసం మా అమ్మాయిని వేధిస్తున్నాడు. ఏ గూండాతోనైనా బెదిరించాలి. ఎవరికి చెబుతాం?’
ఓ పోలీసు కానిస్టేబుల్, మరో కానిస్టేబుల్ అభిప్రాయం అడుగుతాడు.
ప్రభుత్వరంగానికే ప్రయివేటు రంగంతో పనిపడింది.