ఒకప్పుడు గ్లామరే రాజకీయం. నేడు వ్యూహమే సర్వస్వమయిపోయింది. కేవలం వ్యూహమే వుండి, జనాకర్షణ లేకపోయినా దిగులు లేదు. తర్వాత అదే జనాకర్షణగా మారుతుంది. ఉత్త జనాకర్షణ వుండి వ్యూహం లేక పోతే.. ఆ మెరుపు ఎన్నాళ్ళో నిలవదు. జాతీయ రాజకీయాల్లో రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీల విషయంలో అదే జరిగింది. రాహుల్ గాంధీకి జనాకర్షణ అన్నది…
Tag: Nehru
బీజేపీ-కాంగ్రెస్‌ల సమర్పణ: ‘స్వామి..రారా!’
స్వామి తలచుకుంటే కేసులకు కరువా? ‘కలహభోజనుడు’ సుబ్రహ్మణ్య స్వామి అంటేనే వివాదం. ఆయన ఏ పార్టీలో వున్నా ‘వన్ మ్యాన్ ఆర్మీ’ (ఏక సభ్య సైన్యం) లాగా వుంటారు. కూపీలూ లాగటంలోనూ, లొసుగులు వెతకటంలోనూ దిట్ట. అయితే అన్ని కూపీలూ నిలబడవు. కొన్ని వీగిపోతుంటాయి. ఆయన ఎవరి మీదయినా గురిపెట్టారంటే, ఇక వారి చుట్టూనే తిరుగుతుంటారు. రాజకీయంగా ఆయనకు కాంగ్రెస్ మీద ఎప్పుడూ ఒక కన్ను వేసే వుంచుతారు. ఈ మధ్య కాలంలో ఆయన కారణంగా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ రెండు సార్లు వివాదాల్లో చిక్కుకున్నారు.
అసెంబ్లీ లో ‘పంచ్’ శీల!!
‘నమస్కారం సార్! తమరంత పలికిమాలిన వారు మరొకరు వుండరట కదా!’ ఇలా సంభాషణ ఎవరయినా మొదలు పెడతరా?
‘పెద్దలు, సంస్కార వంతులు, విజ్ఞులూ అయిన మీరు..’ అని మొదలు పెట్టి , ‘ఇంత నీచ, నీకృష్టమైన స్థితికి దిగజారతారా?’ అంటూ ఏ వక్తయినా ముగిస్తారా?
‘నీ కాళ్లు కడిగి నెత్తి మీద వేసుకుంటా; నీకు జీవితాంతం ఊడిగం చేస్తా; చచ్చి నీ కడుపున పుడతా.’ అని ప్రాధేయపడి, వెంటనే ‘ ఈ రాష్ట్రాన్ని దోచుకోవటం ఆపవయ్యా!’ అని ఏ బాధితుడయినా మొరపెట్టుకుంటాడా?
వ్యాపారం వద్దురా! రాజకీయం ముద్దురా!!
వెనకటి ఎవరో అన్నారు- దేవుడు లేక పోతే ఎలా-అని? ఉంటే సరే. లేక పోతే ఏం చెయ్యాలి? వెంటనే ఒక దేవుణ్ణి సృష్టించుకోవాలి!!
మనదేశంలో దేవుళ్ళకు లోటు లేదు. స్వరాజ్యం వచ్చాక రాజుకు లోటు వచ్చింది. వెంటనే ఎవర్నో ఒకర్ని రాజుగా చేసుకుని, అతని కుటుంబాన్ని రాజకుటుంబంగా మార్చుకోవాలి.
అలా సమయానికి దొరికిన వ్యక్తే నెహ్రూ. ఆయననుంచి మొదలయి, ఇప్పటి వరకూ నెహ్రూ-గాంధీ కుటుంబం ‘అప్రకటిత రాజకుటుంబం’ అయిపోయింది