కుట్టింది దోమే..! కానీ ఎంత చికాకు? ఎంత అసహ్యం? ఎంత ఉక్రోషం? అదెంత? దాని సైజెంత? ఏనుగంత మనిషిని పట్టుకుని కుట్టెయ్యటమే..?(అవునూ, ఎంఆర్‌ఎఫ్ టైరంత ముతగ్గా వుండే ఏనుగు చర్మాన్ని …ఈ దోమ కుడితే మాత్రం దానికి ఏం తెలుస్తుంది?) కానీ, ముద్దుచేసిన మనిషి సున్నితమైన చర్మం మీద, అందునా, బుగ్గమీద వాలింది కాకుండా, డిగ్రీలేని…