Tag: Satish Chandar Love at Dust Site

ప్రేమ దొరికేది తొమ్మిది సైట్ల లో..!

ఈ నూటొక్క ప్రేమ కథలూ తొమ్మిది సైట్లలో దొరకుతాయి. ఒక్కొక్క సైట్లలోనూ డజను వరకూ వుంటాయి. నిజానికి నూటొక్క కథలంటున్నాను కానీ, రాసింది మాత్రం నూటొక్క మనస్తత్వాలు. అవి లవ్వున్న జీివితాలు, నవ్వున్న మనస్తత్వాలు: మార్కెట్‌ సైట్‌ఇవ్వాలీ, పుచ్చుకోవాలీ కాదు. అమ్మాలి, కొనాలి. అదే మార్కెట్‌. బోడి హృదయాలు ఎవరకయినా వుంటాయి. ఉత్తిని ఇచ్చేస్తానని తిరిగితే…

చంద్ర వికాసం

బహుముఖీన ప్రజ్ఞావంతుడు సతీష్‌చందర్‌.ప్రాథమికంగా అతను కవే అని నా తలంపు. ‘పంచమ వేదం’తోనే కొత్త దారి తీశాడు. ఆర్ద్రత, ఆలోచనాత్మకత, ప్రగతిశీలత, నిర్మాణ సౌందర్యం అతని కవిత్వంలో ప్రస్ఫుటం అవుతాయి. ఆ సాధన, శక్తి కథారచనలో ఎంతో ఉపయోగపడ్డాయి. కొంతమంది అనుకుంటారు, కథల్లో కవితాత్మకత అవసరం లేదని. కానీ ప్రజ్ఞావంతుడైన కవికి ఔచిత్యం, భాషాధికారం, శైలీ…