Tag: satish chandar’s satire

‘ఎలా మాట్లాడతారో అలా రాస్తారు’

సతీష్ చందర్‌ ఎలా మాట్లాడతారో, ఆలా రాస్తారనీ, ఆయన చతురోక్తుల్లో విజ్ఞానం దాగి వుంటుందని, తెలంగాణ రిసోర్స్‌ సెంటర్‌ ఛైర్మన్‌ ఎం. వేదకుమార్‌ అన్నారు. సతీష్‌ చందర్‌ రచించిన వ్యంగ్య గ్రంథం ‘కింగ్‌మేకర్‌’ ను ఆయన 29 అక్టోబర్‌ 2013 న హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం మినీ హాల్‌ లో ఆవిష్కరించారు. సతీష్‌ చందర్‌ తో తనకున్న రెండు దశాబ్దాల స్నేహాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన ఏ పత్రికలో సంపాదకుడిగా పనిచేసినా, ఆ పత్రికను కొత్త పంథాలో నడిపించారన్నారు. ప్రత్యేకించి అట్టడుగు వర్గాల వేదనను ఆయన పలికిస్తారన్నారు.

సతీష్ చందర్ ‘కింగ్ మేకర్’ ఆవిష్కరణ

ఆహ్వానం – సతీష్‌ చందర్‌ కింగ్‌ మేకర్‌ – ఆవిష్కరణ సభ

వేళ: 29 అక్టోబరు 2013(మంగళవారం) సాయింత్రం గం.5.30లు

వేదిక: సుందరయ్య విజ్ఞాన కేంద్రం మినీమహాల్‌, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్‌

సభాధ్యక్షులు: శ్రీ పి.వి. సునీల్‌ కుమార్‌ ఐ.పి.ఎస్‌, నవలా రచయిత, కథకులు ఇన్స్పెక్టర్‌ జనరల్‌, గుంటూరు

నేత గీత దాటితే…!

గీత గీసెయ్యటం తేలికే. దానికి కాపలా కాయటమే కష్టం.

కోపంతో గీసిన గీత కోపం చల్లారేటంత వరకే వుంటుంది.

నిప్పుతో గీసేదే గీత. నీళ్ళు తెస్తే చెరిపి వేతే.

కోపం రగిలి లక్ష్మణుడు గీత గీస్తే,, కోపం రగిలించటానికి కృష్ణుడు గీత చెప్పాడు.

స్పష్టత తెచ్చేది గీత. తనవారికీ, పగవారికీ తేడా చెప్పేది గీత. ఈ గీత చెరిగి పోతే-చెంగు చాచే వాడెవడో, కొంగు లాగే వాడెవడో సీతకూ తెలియదు; బంధువెవడో, శత్రువెవడో అర్జునుడికీ తెలియదు.

‘దేహ’ భక్తులు

‘బాబా రామ్‌ దేవ్‌కీ, స్వామీ నిత్యానందకీ తేడా ఏమిటి గురూజీ?’

‘ఇద్దరు చూపే మోక్షం ఒక్కటే. మార్గాలు వేరు శిష్యా!’

‘అంత డొంక తిరుగుడు ఎందుకు గురూజీ? ఒకరు యోగా బాబా, ఇంకొకరు భోగా బాబా- అని చెప్పొచ్చు కదా?’

‘తప్పు. శిష్యా ఇద్దరూ కట్టేది కాషాయమే!’

పదవొచ్చాక పైసలా? పైసలొచ్చాక పదవా?

‘ప్రేమ ముందా? పెళ్ళి ముందా?’

పెద్ద చిక్కొచ్చిపడింది- సత్యవ్రత్‌ అనే ఒక ప్రేమకొడుక్కి.

బుధ్ధిగా ఎల్‌కేజీ, యుకేజీ.. ఇలా క్రమ బధ్ధంగా పెరిగాడే తప్ప, టూజీ,త్రీజీ ల్లా అక్రమబధ్ధంగా పెరగలేదు.

అలా పెరిగితే, ‘స్కాము కొడుకు’ అయ్యేవాడు కానీ, ప్రేమ కొడుకు అయ్యేవాడు కాడు.

నీతిమంతుడు ఎక్కడ పడాలో అక్కడే పడతాడు. చూసి, చూసి ప్రేమలో పడ్డాడు.

తల వంచుకుంటే, ఒక ‘తన్ను’ ఉచితం!

ఉచితం. బోడిగుండు ఉచితం-
విగ్గులు కొంటే.
పెళ్ళికొడుకు ఉచితం-
అమ్మాయి జీతం అనబడే నెలసరి కట్నం తెస్తే.
కర్చీఫ్‌ ఉచితం-
ఏడుపు గొట్టుసినిమా చూసిపెడితే.
ఎలా ఎన్నెన్నో బంపర్‌ ఆఫర్లు. ఉచితం అంటే చాలు- మనవాళ్ళకి వొళ్ళు తెలియదు. డబ్బుపెట్టి కొనటమంటే మనవాళ్ళకు మహా చికాకు.దానితో పాటు ఏదోఒకటి ఉచితంగా కొట్టేశామన్న తృప్తి వుంటే మాత్రం తెగించి కొనేస్తారు.