Tag: strike

చీకటా? ‘లైట్’ తీస్కో…

అలవాటయిత ఆముదం కూడా ఆపిల్ జ్యూస్ లాగే వుంటుంది. ఆండాళ్ళమ్మ మొగుడు రాత్రి రోజూ తాగి వస్తాడు. అలవాటయిపోయంది. మొగుడిక్కాదు, ఆండాళ్ళమ్మకు. అతడు తాగి రాగానే అడ్డమయిన బూతులూ తిటే్స్తాడు. వీలుంటే నాలుగు ఉతుకుతాడు. పెట్టిన అన్నం మెక్కేస్తాడు. ఆ తర్వాత భోరుమని ఏడ్చేస్తాడు.’నిన్ను ఎన్ని మాటలు అన్నానో ఆండాళ్ళూ…’ అని పసికూనలా గారాబాలు పోతాడు. ఈ మొత్తం తంతుకు ఆమె అలవాటు పడిపోయింది. ఎప్పుడయినా అతడు తాగి రాలేదో..,ఆండాళ్ళమ్మకు నచ్చదు.