హవ్వ..!

                హవ్వ!                 బొంకేసింది. తనకి పిల్లలే లేరని అడ్డంగా బొంకేసింది.                 జనాభా లెక్కల్లోంచి ఇద్దర్ని తీసేసింది. చెట్టంత కొడుకుల్ని  కాలనీ లోనే  పెట్టుకుని, తాను ‘గొడ్రాలి’ నని తన నోటితోనే చెప్పేసింది. చెబుతూ నవ్వేసింది కూడా. నవ్వొచ్చి కాదు. పురుటి నొప్పులు గుర్తొచ్చి.                 రాసుకునే వాళ్ళు పదే పదే అడిగి, పిల్లల్లేని…

బెంగ

నాన్న కూడా అమ్మే. నిఖిలకు న్యూయార్క్ వెళ్ళిన రోజే ఈ రహస్యం తెలిసిపోయింది. వీడియో కాల్ చేస్తే చాలు. ఏడుపే ఏడుపు. పోటీపడి మరీ రాగాలు తీశారు. అమ్మకది మామూలే. కానీ నాన్నకు ఈ రాగ జ్ఞానం ఎలా అబ్బిందో తెలియటం లేదు. అందుకోవటం అందుకోవటమే ఆరున్నర శ్రుతిలో అందుకున్నారు. మొదటి రోజు కదా ఆ…

‘ట్రంపే’ ఇంపు

ట్రంప్‌ మొండి. ఉత్త మొండి కాదు. జగమొండి. వణకడు.
తొణకడు. గెలిచాడు. ఓడాడు. మళ్ళీ గెలిచాడు.
పీక చుట్టుకున్న కేసులకూ అదరలేదు. చెవిపక్కనుంచే దూసుకుపోయిన బులెట్‌కూ బెరవలేదు. పడ్డ చోటనే లేచాడు.

ముల్లు

పేరు విక్టర్‌. కానీ పరాజితుడు. రోజీవాళ్ళ పేటే అతడిది కూడా. పదోతరగతి తప్పి పేటలో వుండిపోయాడు. ఆ తర్వాత మూడేళ్ళకు బయిటపడి, హాస్టల్‌ తర్వాత హాస్టల్‌ మారుతూ యూనివర్శిటీ హాస్టల్లో సెటిలయ్యాడు. డిగ్రీ తర్వాత డిగ్రీ చేసుకుంటూ,  ఉచిత భోజన, వసతులను కష్టపడి సాధించి,  గ్రూప్‌ వన్‌ నుంచి కానిస్టేబుల్‌ వరకూ నిర్వహించే సమస్త పోటీ పరీక్షలకూ కూర్చునేవాడు. అలా అతడికి నలభయ్యేళ్ళు నిండిపోయాయి.

ప్రేమ దొరికేది తొమ్మిది సైట్ల లో..!

ఈ నూటొక్క ప్రేమ కథలూ తొమ్మిది సైట్లలో దొరకుతాయి. ఒక్కొక్క సైట్లలోనూ డజను వరకూ వుంటాయి. నిజానికి నూటొక్క కథలంటున్నాను కానీ, రాసింది మాత్రం నూటొక్క మనస్తత్వాలు. అవి లవ్వున్న జీివితాలు, నవ్వున్న మనస్తత్వాలు:

యువర్ ఆనర్

కోరిక కలిగితే తీర్చుకోవచ్చు. ఆకలి వేస్తే తినవచ్చు.కానీ, సమస్య అది కాదు. తినాలి. ఆకలి వెయ్యటం లేదు. ఆకలి కలిగించుకోవాలి. ఇష్టమైన తిండే. ఆకలి లేకుండా ఎలా తినేదీ.?ప్రేమ కలిగించుకోవాలి. అవును. ప్రియుడి మీదే. అప్పుడు కదా, ఊపిరాడకుండా కావలించుకోవటమో, లేక మీదపడి ముద్దు పెట్టుకోవటమో, భుజం మీద వాలి భోరున ఏడ్చుకోవటమో చేసేదీ..!పద్దెనిమిదేళ్ళు. అంటే…

కులానికి ఏడు ముఖాలు

ఇక్కడ అందరూ దానిలోనే పుడతారు. దాని చుట్టూనే తిరుగుతారు. దానితోనే పోతారు. అదే కులం. దానికి అన్నీ ముఖాలే. కానీ ఈ ఏడూ ముఖ్యం. ఆ ఏడూ ఈ పుస్తకంలోని ఏడు అధ్యాయాలు: 1. కులం లేదంటే ఉన్నట్లే ఉన్నా కనిపించని ముఖమిది. ‘ఇప్పుడింకా కులమెక్కడ వుందీ?’ అన్న వారు ఈ ముఖంతో తిరుగుతారు. ఈ…

చంద్ర వికాసం

బహుముఖీన ప్రజ్ఞావంతుడు సతీష్‌చందర్‌.ప్రాథమికంగా అతను కవే అని నా తలంపు. ‘పంచమ వేదం’తోనే కొత్త దారి తీశాడు. ఆర్ద్రత, ఆలోచనాత్మకత, ప్రగతిశీలత, నిర్మాణ సౌందర్యం అతని కవిత్వంలో ప్రస్ఫుటం అవుతాయి. ఆ సాధన, శక్తి కథారచనలో ఎంతో ఉపయోగపడ్డాయి. కొంతమంది అనుకుంటారు, కథల్లో కవితాత్మకత అవసరం లేదని. కానీ ప్రజ్ఞావంతుడైన కవికి ఔచిత్యం, భాషాధికారం, శైలీ…

కారులో రేప్‌ చేస్తే, కొలిచి మరీ కోప్పడతారా?

కోపం.రావచ్చు; తెచ్చుకోవచ్చు.తెచ్చుకునే కోపాల్లో ఎక్కువ తక్కువలు వుండవచ్చు. ఎంత తెచ్చుకోవాలో అంతే తెచ్చుకునే స్థితప్రజ్ఞులు వుంటారు. అన్ని రంగాల్లోనూ కనిపిస్తారు. రాజకీయ నేతల్లో అయితే మరీను.కానీ, వచ్చే కోపం అలా కాదే. అది తన్నుకుని వచ్చేస్తుంది. దానికెవరూ ఆనకట్ట కాదు కదా, కనీసం బరాజ్‌ కూడా నిర్మించలేరు. సాదా సీదా మనుషులకు వచ్చేవి ఇలాంటి కోపాలే…

‘అంబేద్కర్‌ ప్రదేశ్‌’ అంటే, రాష్ట్రాన్ని అంటించే స్తారా..?

అంబేద్కర్‌. అవును. ఒక పేరే. భారతదేశపు నుదుటి రాతను (రాజ్యాంగాన్ని) రాసిన పేరు. ప్రపంచ అత్యున్నత సంస్థ (ఐక్యరాజ్యసమితి) ముచ్చటపడి స్మరించుకన్న పేరు.కానీ ఆ పేరే కోనసీమలో చిచ్చురేపింది. ఆ పేరు ‘వద్దంటే.. వద్దంటూ’ రోడ్లమీద కొచ్చారు. రాళ్ళు విసిరారు. ఇళ్ళు దగ్ధం చేశారు. పోలీసుల్ని (జిల్లా ఎస్పీ సహా) నెత్తురొచ్చేట్టు కొట్టారు. షెడ్యూల్డు కులానికి…

‘టెన్త్‌’ పాస్‌ ‘గ్రేట్‌’ ఫీట్‌!

పదివసంతాలు దాటిన రాజకీయ వార పత్రికతెలుగు మేగజైన్‌ జర్నలిజం చరిత్రలో మైలురాయి నేడు రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాక, తెలుగు వారుండే పొరుగు రాష్ట్రాలలో అత్యధిక పాఠకాదరణ వున్న ఏకైక తెలుగు రాజకీయ పత్రికగా ‘గ్రేట్‌ ఆంధ్ర’ కొనసాగుతోంది. పత్రిక తేవటం వేరు; తెచ్చి నడపటం వేరు; నడిపి నిలపటం వేరు.దశాబ్దం గడచింది. గ్రేట్‌ ఆంధ్ర…

తా చెడ్డ ‘కొడుకు’ ‘వనమె’ల్లా చెరిచాడు?

అడిగేశాడు. అడక్కూడనిది అడిగేశాడు. కోరకూడనిది కోరేశాడు. ‘పిల్లలు కాకుండా, కేవలం నీ భార్యతో రా!’ అని అనేశాడు. అడిగిందెవరో కాదు. ఒక ఎమ్మెల్యే కొడుకు. ‘ఆస్తి తగాదా ను పరిష్కరించాలంటే, ఇంతకు మించి మార్గం లేదు’ అని బెదరించాడు. ఎవర్నీ? ఒక మధ్యతరగతి మనిషిని. ఇదీ అభియోగం; ఆ మధ్యతరగతి మనిషి చేసిన ఆరోపణ. అది…