అద్వానీ ముందుకి.. రథం వెనక్కి!

అద్వానీ కేరకేచర్ (Courtesy:Sekhar)

గురూజీ?
వాట్ శిష్యా!

‘అద్వానీ తన రథయాత్రలో తెలంగాణ గురించి మాట్లాడకుండా వుండలేరా..?’
‘మాట్లాడితే నష్టమేమిటి శిష్యా..!’

‘నష్టమే గురూజీ! ఆయన రథమెక్కి ఏది కోరుకుంటే అది జరగదు. రామ మందిర నిర్మాణం కోసం రథం ఎక్కాడా? అది జరగలేదు. ఇప్పటికిప్పుడు అవినీతి నిర్మూలన కోసం రథమెక్కాడా.. అవినీతి కేసులో తమ పార్టీనేత యెడ్యూరప్ప దొరికిపోయి వెక్కిరించాడు.’

‘అయితే ఇప్పుడేమంటావ్ శిష్యా?’
‘తెలంగాణ వస్తుందని రథ మెక్కిచెబుతున్నారు- అద్వానీ. అసలు ఆయన ఉద్దేశ్యం ఏమిటి గురూజీ..?’
‘నాకు తెలియదు శిష్యా.!’

Leave a Reply