అనుకరణ

(అనుకుంటాం కానీ,మనసును కూడా పెట్టుకుని వెళ్ళటం-అంటే పసిపిల్లాడిని వెంటతీసుకుని వెళ్ళటమే.ప్రతి చిన్న వస్తువూ వాడికి వింతే. పువ్వు పూసేయటమూ, కోకిల కూసేయటమూ, పండు రాలిపడటమూ- ఏది చూసినా అక్కడ ఆగిపోతుంటాడు. మనల్ని ఆపేస్తాడు. మనసూ అంతే. ఎక్కడ పడితే అక్కడ తాను పడిపోతుంది.మనల్ని పడేస్తుంది.)

మల్లె (photo by IlluminatedPerfume)

అరజాబిల్లిని చూసి
చిరునవ్వూ-
కోయిలమ్మ కవ్వింపు విని
కూని రాగం-
మల్లెపువ్వును తాకి
మెత్తని చీరా-
ఓహ్‌!
అవని మొత్తం అనుకరణే!

-సతీష్‌ చందర్‌
(ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రచురితం)

Leave a Reply