కాంగ్రెస్‌కు ‘ఉప’నయనం!

‘గురూజీ?’

‘వాట్‌ శిష్యా!’

‘రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ‘ఉప’ అనే మాట అచ్చొచ్చినట్లుంది గురూజీ?’

‘ఎందుకలా అంటున్నావ్‌ శిష్యా?’

‘తెలంగాణ వత్తిడి నుంచి తట్టుకోవటానికి అన్నీ ‘ఉప’పదవులే ఇచ్చారు కదా గురూజీ!’

‘అంటే..?’

cartoon: balaram

‘ఉప ముఖ్యమంత్రి, ఉపసభాపతి’

‘అయితే ఏమంటావ్‌ శిష్యా?’

‘ఇప్పుడు ఉపఎన్నికలొస్తున్నాయి కదా గురూజీ?’

‘వస్తే..?’

‘అవి కూడా అచ్చొస్తాయేమోనని గురూజీ?’

‘నీ అంచనా తప్పు శిష్యా! ఇటీవలి ఉప ఎన్నికలలో కాంగ్రెస్‌ రెండవ స్థానంలోకే వెళ్ళింది.’

‘నేనంటున్నది అదే గురూజీ. ఉప- అంటే రెండవ స్థానమే కదా..?’

‘ఓహో అదా! నాకు తెలియదు శిష్యా!?’

-సతీష్‌ చందర్‌

Leave a Reply