కృతజ్ఞత!

(సొమ్ములు మాత్రమా కాదు. మనం బతకాల్సిన క్షణాలు కూడా బ్యాంకులో వుంటాయి. ఖర్చు చెయ్యాలి తప్పదు- మనకి మనం ఖర్చు చేసుకుని చాలా సార్లు దు:ఖపడుతుంటాం- నిల్వ తగ్గిపోతుందని. మనకిష్టమయిన వాళ్ళకు ఖర్చు చేసినప్పుడు మాత్రం ఎందుకో…బ్యాంకు బాలెన్స్ పెరిగినట్టుంటుంది. గణితానికి అందనిదే- అనుబంధమంటే…!)

photo by robert and fabienne


తియ్యని ఫలాన్ని
తిన్నప్పుడెల్లా
కాస్సేపు కళ్ళు మూసుకోవాలి.
భక్తి తో కాదు.
కృతజ్ఞతతో.
చెట్టు నాటిన రైతు
పురుగుమందు తిన్నా
మన కోసం
మరొక్క సారి
పుడతాడు.
-సతీష్ చందర్
(ప్రజ దినపత్రిక లో ప్రచురితం)

Leave a Reply