గురి పాఠం!

(గొర్రెలు నడుస్తాయనుకుంటాం. నడవబడతాయి. చిలుకలు పలుకుతాయనుకుంటాం. పలుకబడతాయి. గాడిదలు మోస్తాయనుకుంటాం. కానీ మోయబడతాయి. తలకాయలు ఎవరికయినా ఇచ్చేస్తే, మనమూ అంతే..! బతకం. బతకబడతాం. గురిని మరచి ఉరి వైపు పరుగులు పెడతాం.)

Photo by Intel guy

జగమంతటిలో

చేపకన్ను తప్ప

మరేదీ

చూడని వారే

జీవించటం చేతనైన వారు.

గురిని

మరచినది

క్షణమైనా

మరణించిన క్షణమే.

-సతీష్ చందర్
(‘ప్రజ‘లో ముద్రితం)

1 comment for “గురి పాఠం!

  1. సతీష్ చందర్ గారూ,
    మీ కవిత చిన్నదైనా, దాని ఉపోద్ఘాతం దాని అంతరార్థాన్ని పట్టి ఇచ్చింది. ముఖ్యంగా Active గా ఉండవలసిన మన voice and actions, Passive (pun intended) గా ఉన్నాయన్న భావన బాగుంది.
    అభినందనలు.

Leave a Reply