తెలంగాణకు మొండి ‘చెయ్యి’

కేరికేచర్ : బలరాం

‘గురూజీ?’
‘వాట్ శిష్యా?’

‘తెలంగాణ ఇప్పట్లో రాదని కాంగ్రెస్ చెప్పేసి నట్లేనా?’
‘అనిపిస్తోంది.’

‘అనిపించటమేమిటి గురూజీ? వరుసగా అందరూ చెప్పేశారు కదా?’
‘ఎవరెవరు శిష్యా?’

‘అజాద్,ప్రణబ్,అభిషేక్ సింఘ్వీ,రషీద్ ఆల్వీ’
’ఇంకా.. ?‘

‘ఇంకా ఏమిటి గురూజీ? సాక్షాత్తూ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా చెప్పేశారు.’
’అయినా, ఇంకొకరున్నారు. సోనియా’

’ఆమె కూడా చెప్పేశారనుకోండి.. అప్పుడయినా నమ్ముతారా? లేక అమెరికా అధ్యక్షుడు బరాక్ ఓబామా కూడా చెప్పాలంటారా? మనల్ని నిజంగా పాలించేది అమెరికాయే కదా?’
‘నాకు తెలియదు శిష్యా….!‘

-సతీష్ చందర్

Leave a Reply