మన్ మోహన్ ‘పోరు’బాట!

కేరికేచర్:బలరాం

గురూజీ?
వాట్ శిష్యా!

‘మన్ మోహన్ సింగ్ కూడా ఉద్యమాల బాట పయినిస్తున్నారు. తెలుసా?’
‘ఆయన ఉద్యోగం ఆయన చేసుకుంటుంటే, ఉద్యమాల్లోకి దించుతావేమిటి శిష్యా?!’

‘నేను దించటంలేదు. ఆయనే తెలంగాణలో ఉద్యమాలను అనుసరిస్తున్నారు గురూజీ?’
‘అడిగేదేదో సూటిగా అడుగు శిష్యా..?’

‘తెలంగాణలో ఆర్టీసీ కార్మికులూ, ఉపాధ్యాయులూ, సింగరేణి కార్మికులూ- ఎవరూ తమ సమ్మెను విరమించలేదు. వాయిదా వేశారు గురూజీ .’
‘అయితే ఏమంటావ్ శిష్యా?’

‘మన్ మోహన్ సింగ్ కూడా తెలంగాణ ఇవ్వనని విరమించలేదు. వాయిదా వేశారు. ఇప్పుడు చెప్పండి. ఆయన ఉద్యమ పంథాను అనుసరించాడా? లేదా?’
‘ నాకు తెలియదు శిష్యా..!?’

-సతీష్ చందర్

Leave a Reply