శస్త్రకారుడు

ధ్వంసం చేసాకే సృష్టి. కానీ పాత కొంపను కూల్చిన వాణ్ణి ఎవరూ గుర్తు పెట్టుకోరు. కొత్త ఇల్లు కట్టిన వాడికే సత్కారం.గొయ్యి తీయటం మనకి నచ్చదు. దాంట్లో పునాది రాళ్ళు వెయ్యటం మురిపెంగా వుంటుంది. చెత్తను తగులబెట్టే వాడికి క్షణమైన శిరస్సువంచిన జాతి మాత్రమే ముందుకు వెళ్తుంది. నిర్మాణానికి ముందు వింధ్వంసమే నడుస్తుంది- హొయలు పోయే సీతాకోక చిలుకక ముందు, ముడుచుకు పోయే గొంగళి పురుగు నడిచినట్లు…!

శిశుజననం (photo by bionicteaching)

పండంటి బిడ్డను
పైకి తియ్యగలిగిన వైద్యుడే
నిండు చూలాలి
కడుపు కొయ్యగలడు.
హత్తుకోవటం
తెలిసిన వాడే
కత్తి పట్టటానికి
అర్హుడు.
-సతీష్‌ చందర్‌
(ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రచురితం)

2 comments for “శస్త్రకారుడు

  1. నాలో ఆశవహ దృక్పధాన్ని పెంచుతుంది..
    ముందుకెళ్ళ గలనా అన్న నా అనుమానాన్ని నరికేస్తుంది..
    నా ఆశయాన్ని బుజానికెత్తుకుని ముందుకు తీసుకెళ్తుంది..
    మీ కవిత..

Leave a Reply