సంక్షిప్త మరణం

క్షణం కూడా కాలమే. ఒక్కొక్క సారి క్షణమే శాశ్వతమైన చిత్తరువయిపోతుంది. చెరిపేద్దామన్నా చెరగదు. అందుకే నుదుటి మీద చెమట బొట్టును విదల్చేసినట్టు క్షణాన్ని విసిరేయకూడదు. అది ఎవరో ఒక అపరిచితురాలు అలా నవ్వుతూ చూసిన క్షణం కావచ్చు. లేదా, అమ్మ తన పని తాను చేసుకుంటూ తలను నిమిరి వెళ్ళిన క్షణం కావచ్చు. లేదా, కేవలం ఆత్మగౌరవం కోసం రాజీనామా పత్రాన్ని యజమాని ముఖం మీద కొట్టిన క్షణం కావచ్చు. బతికిన క్షణమంటే అదేనేమో కూడా..!

నిద్ర (Photo by minjoong)

బతుకే
బందిఖానా అయితే
చావునాడే విడుదల
అనుదినమూ
మనం మరణించి
మళ్ళీ జన్మిస్తుంటాం.
కునుకు తీసిన
సమయమంతా
సంక్షిప్త మరణమే.
-సతీష్ చందర్
(ఆంధ్రభూమి దినపత్రికలో ప్రచురితం)

1 comment for “సంక్షిప్త మరణం

Leave a Reply