సమాచార కాంక్ష

కడలికి నింగిని చేరాలనీ, నింగికి కడలిని చేరాలనీ కోరిక. కడలి రగిలి రగిలి ఆవిరయి వెండి మేఘంలాగా పైకి చేరిపోతే, నింగి పొగిలి పొగిలి ఏడ్చి వానగా కడలికి చేరుతుంది. గుండెకు గుండెను చేరాలనే కోరిక. దేహానికి మరో దేహంతో పెనవేసుకోవాలనే కోరిక. మనిషికి మనిషి చేరుకునే కోరికే లేకుంటే జీవితం పుట్టగానే ముగిసిపోతుంది.

Photo by Kishen Chandar

తీరిక వుండాలే కానీ,
పుట్టని కోరిక
ఏముంటుంది?
ఎకాఎకిన
ఎవరినయినా కలవాలనో,
ఎదుటిలేక పోయినా,
సంభాషించాలనో,
మనసంతా మూటగట్టి
అందించాలనో..
ఏదో తెలియని
వ్యక్తావ్యక్త కాంక్ష.
సన్యాసి కూడా
జయించలేనిదే
సమచార కోరిక!
-సతీష్ చందర్
(ప్రజ దినపత్రికలో ప్రచురితం)

2 comments for “సమాచార కాంక్ష

Leave a Reply