‘డైలాగుల్లేని పాత్ర’

విజయశాంతి కేరికేచర్ : బలరాం

గురూజీ?
వాట్ శిష్యా!

‘విజయశాంతి టీఆర్ఎస్ లో వున్నట్లా? బీజేపీలోనే వున్నట్లా?’
‘టీఆర్ఎస్ లోనే వున్నారు శిష్యా. అయినా ఆ ఆనుమానం దేనికి?’

‘అద్వానీతో కలిసి ఊరేగారు కదా గురూజీ?’
‘తెలంగాణ మద్దతు కోరుతూ వెళ్ళివుంటారు శిష్యా.’

‘అంతేనా? డైలాగుల్లేని పాత్ర నచ్చక పోవటం వల్లా?’
‘డైలాగుల్లేని పాత్రా..? ఆవిడకు ఎవరు ఇచ్చారు శిష్యా..?!’

‘కేసీఆరే.. చెల్లెలి పాత్ర ఇచ్చి ప్రతీ సమావేశంలోనూ విజయశాంతిని పక్కనే కూర్చోబెట్టుకుంటారు. కానీ ఆమె తరఫున కూడా ఆయనే

మాట్లాడతారు. ఇది డైలాగుల్లేని పాత్ర కాదా… గురూజీ?
‘ నాకు తెలియదు శిష్యా..!’
-సతీష్ చందర్

1 comment for “‘డైలాగుల్లేని పాత్ర’

Leave a Reply