చదవేస్తే ఉన్న ‘నీతి’ పోతుందా?

ఒకడేమో కడుపు కోసేస్తానంటాడు; ఇంకొకడేమో గోతులు తీసేస్తానంటాడు; మరొకడేమో మక్కెలు విరగ్గొడతానంటాడు; అదీఇదీ కాక టోపీపెట్టేస్తానంటాడు ఓ తలకాయలేని వాడు. ఇవన్నీ పిచ్చి ప్రగల్బాలు కావు. కలలు. పిల్లకాయలు కనే కలలు.కలలు కనండీ, కలలు కనండీ… అనీ కలామ్‌ గారు పిలుపు నిచ్చారు కదా- అని, ఇలా మొదలు పెట్టేశారు. పనీ పాట లేక పక్క ఫ్లాట్లలో పిల్లల్ని పోగేసి, కలామ్‌ గారడిగినట్లే, మీరేం కావాలనుకుంటున్నార్రా అని అడిగాను. ఒక్క వెధవ తిన్నగా చెప్పలేదు.

‘హౌస్‌’ కన్నా జైలు పదిలం!

‘ప్రజాస్వామ్యానికి అసెంబ్లీ, సెక్రెటేరియట్‌- ఈ రెండూ అవసరం అంటారా?’

‘అదేమిటి శిష్యా? అంత మాట అనేశావ్‌?’

‘అసెంబ్లీ ఎందుకు చెప్పండి?అరుచుకోవటానికి కాకపోతే..! ఎమ్మెల్యేలు ఆ ఆరుపులేవో టీవీ స్టుడియోల్లో ఆరచుకోవచ్చు కదా?’

‘మరి చట్టాలు ఎక్కడ చేస్తారు శిష్యా?’

‘దేహ’ భక్తులు

‘బాబా రామ్‌ దేవ్‌కీ, స్వామీ నిత్యానందకీ తేడా ఏమిటి గురూజీ?’

‘ఇద్దరు చూపే మోక్షం ఒక్కటే. మార్గాలు వేరు శిష్యా!’

‘అంత డొంక తిరుగుడు ఎందుకు గురూజీ? ఒకరు యోగా బాబా, ఇంకొకరు భోగా బాబా- అని చెప్పొచ్చు కదా?’

‘తప్పు. శిష్యా ఇద్దరూ కట్టేది కాషాయమే!’

పైన తీపి, లోన కారం! ఇదే గోదావరి వెటకారం!!

పిచ్చివాళ్ళకీ, మేధావులకీ నెలవు మావూరు. ఇద్దరూ వేర్వేరా? కాదేమో కూడా. జ్ఞానం ‘హైపిచ్చి’లో వుంటే మేధావే కదా! నర్సాపురం (పశ్చిమ గోదావరి జిల్లా) మా వూరు. అన్నీ అక్కడ కొచ్చి ఆగిపోతుంటాయి. రైళ్ళాగిపోతాయి. బస్సులాగిపోతాయి. కడకు గోదావరి కూడా మా కాలేజి చుట్టూ ఒక రౌండు కొట్టి కొంచెం దూరం వెళ్ళి ఆగిపోతుంది( సముద్రంలో కలిసిపోతుంది.) నాగరికత కూడా మా వూరొచ్చి ఆగిపోతుంది.
రైళ్లు ఆగిపోయిన చోట పిచ్చి వాళ్ళూ, నాగరికత పరాకాష్టకు చేరిన చోట మేధావులూ వుండటం విశేషం కాదు.

కాంగ్రెస్‌కు ‘ఉప’నయనం!

‘గురూజీ?’

‘వాట్‌ శిష్యా!’

‘రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ‘ఉప’ అనే మాట అచ్చొచ్చినట్లుంది గురూజీ?’

‘ఎందుకలా అంటున్నావ్‌ శిష్యా?’

‘తెలంగాణ వత్తిడి నుంచి తట్టుకోవటానికి అన్నీ ‘ఉప’పదవులే ఇచ్చారు కదా గురూజీ!’

‘అంటే..?’

‘గురూజీ?’

‘వాట్‌ శిష్యా!’

‘రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ‘ఉప’ అనే మాట అచ్చొచ్చినట్లుంది గురూజీ?’

‘ఎందుకలా అంటున్నావ్‌ శిష్యా?’

‘తెలంగాణ వత్తిడి నుంచి తట్టుకోవటానికి అన్నీ ‘ఉప’పదవులే ఇచ్చారు కదా గురూజీ!’

‘అంటే..?’

పదవొచ్చాక పైసలా? పైసలొచ్చాక పదవా?

‘ప్రేమ ముందా? పెళ్ళి ముందా?’

పెద్ద చిక్కొచ్చిపడింది- సత్యవ్రత్‌ అనే ఒక ప్రేమకొడుక్కి.

బుధ్ధిగా ఎల్‌కేజీ, యుకేజీ.. ఇలా క్రమ బధ్ధంగా పెరిగాడే తప్ప, టూజీ,త్రీజీ ల్లా అక్రమబధ్ధంగా పెరగలేదు.

అలా పెరిగితే, ‘స్కాము కొడుకు’ అయ్యేవాడు కానీ, ప్రేమ కొడుకు అయ్యేవాడు కాడు.

నీతిమంతుడు ఎక్కడ పడాలో అక్కడే పడతాడు. చూసి, చూసి ప్రేమలో పడ్డాడు.

‘స్వవిశ్వాస’ తీర్మానం!

‘గురూజీ?’
‘వాట్‌ శిష్యా!’

‘మొన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానంలో ఎవరు గెలిచినట్లు గురూజీ?’
‘అవిశ్వాస తీర్మానంలోనా? ఇంకెవరూ? కిరణ్‌ సర్కారే…’

‘లేదు. జగన్‌, చంద్రబాబులు కుడా గెలిచారు గురూజీ!’
‘అదెలా శిష్యా?’

‘వెండితెర’ తీస్తే… వనితల మెడలో ఉరితాళ్ళే!!

(ఇంట్రో…

పదిహేనేళ్ళ క్రితం నాటి మాట. నేను అప్పుడు వార్త దినపత్రికకు అసోసియేట్‌ ఎడిటర్‌ వున్నాను. సిల్క్‌ స్మిత చనిపోయిందన్న వార్త న్యూస్‌ ఏజెన్సీల ద్వారా మాకు చేరింది. ఆమె చనిపోవటం కన్నా, చనిపోయిన తీరు నన్ను బాధించింది. ఆ రోజు ఆమె మీదనే సంపాదకీయం రాయాలని నిర్ణయించుకున్నాను. రాసేశాను. ఇంకా అది పేజీల్లోకి వెళ్ళకుండానే, ఎలా తెలిసిందో మార్కెటింగ్‌ విభాగం వారికి తెలిసిపోయింది. అప్పటి జనరల్‌ మేనేజర్‌ అయితే కంగారు పడ్డాడు. ‘ఆమె ఏమన్నా మహానటి సావిత్రా? వ్యాంప్‌ (రోల్స్‌ వేసుకునే ఆమె) మీద సంపాదకీయమా? పరువు పోతుంది.’ అన్నాడు. నేను వినలేదు.

No-Confidence Motion Needs Castes- Not Numbers!

Undoubtedly numbers matter for the no-confidence motion moved in the Andhra Pradesh Assembly. These numbers are not with political parties, but a few dominant castes, say, Kammas, Reddy, Kapus and Velamas. Barring Velamas, each community finds it an opportune moment to express their displeasure (no-confidence)on the other.