చెడిపోవాలన్న కోరిక పుట్టాలే కానీ, ఎలాగయినా చెడిపోవచ్చు. డబ్బుండీ చెడిపోవచ్చు; డబ్బులేకా చెడిపోవచ్చు. వెనకటికి కవి కాళోజీ అన్నాడు -ఉన్నవాడిదీ లేని వాడిదీ ఒకటే బాధ:’తిన’లేక- అని. ఇప్పుడు డబ్బున్న పిల్లలకీ, డబ్బులేని పిల్లలకీ ఒక్కటే జబ్బొస్తోంది. మైనారిటీ తీరకుండానే, బాల్యం వదలకుండానే, పెద్ద పెద్ద పనులు చేసేస్తున్నారు. క్రూరమైన, ఘోరమైన నేరాలు చేసేస్తున్నారు. ఖరీదయిన…
మీటింగ్స్ తోనే రాహుల్‌కు రేటింగ్సా..?
రాహుల్ గాంధీ రేంజ్ హఠాత్తుగా మారిపోయిందా? ఆయన రేటింగ్స్ ఠపీ మని పెరిగిపోయాయా? యువరాజుకి పార్టీలో రాజయోగం పట్టేసినట్లేనా? అధ్యక్షుడికి ముందు వున్న ‘ఉప’ విశేషణం తొలిగిపోయినట్లేనా? చూడబోతే, ఇలాంటి వింత ఏదో దేశ రాజకీయాల్లో జరిగేటట్లుగానే వుంది. ఆటలో ఎప్పుడోకానీ గెలవని వాడిని, గెలిపించాలంటే రెండే రెండు మార్గాలు. ఒకటి: ఆట నేర్పించటం రెండు:…
‘మూడు’తలాకులూ..’ఆరు’తడబాట్లూ..!
‘పక్కా’ ‘మగ’పతిరావు!
పేరు : తమ్మారెడ్డి చలపతి రావు దరఖాస్తు చేయు ఉద్యోగం: స్త్రీజనోధ్ధారకుడు (‘పక్క’లోకి మాత్రమే స్త్రీలు పనికి వస్తారని లోకానికి ఎలుగెత్తి చాటటం.) వయసు :నాది బాబాయి వయసూ… తండ్రి వయసూ… తాత వయసూ అని పరిచయం చేస్తారు కానీ..నాది మళ్ళని వయసు.( లేకుంటే కొన్ని దశాబ్దాల పాటు ఒకే ‘రేపిస్టు’ పాత్రను ఎలా చెయ్యగలుగుతాను…?)…
‘అమితా’శలపై తెలుగు నీళ్ళు..?
అణచుకుంటే అణిగేదీ, తీర్చుకుంటే తీరేదీ కోరిక కాదు. ఆ తర్వాత పెరుగుతుంది, చచ్చినట్టే చచ్చి తిరిగి పుడుతుంది. అందుకే కాబోలు- అటు అణచటం, ఇటు తీర్చుకోవటమూ కాకుండా- కోరికను జయించ మన్నాడు బుద్ధుడు. కాంక్షలన్నిటిలోనూ పెద్ద కాంక్ష రాజ్యకాంక్ష. ఇది ఒక పట్టాన తీరదు. రాచరికాలు పోయినా, ప్రజాస్వామ్యం వచ్చేసినా రాజ్యమేలాలనే కాంక్ష పదిలంగా వుంది.…
ఆవకాయ కూడా ఆవుకూరేనా..!?
నిఘా. నిఘా.. కుడి ఎడమల నిఘా, నిఘా. ఇంటి కింది కాపురాలు, ఒంటి మీది వస్త్రాలు, పంటి కింది ఆహారం- అన్నింటిమీదా నిఘా. ఇష్టమైన పిల్లను చేసుకుంటే పరువు హత్య. నచ్చిన దుస్తులువేసుకుందనే నెపం మీద అత్యాచారం. దొరికిన ఆహారం తింటే మారణహోమం. వీటికి వత్తాసుగా సర్కారు నడిపే వారి వ్యాఖ్యలు, హుకుంలు, నిర్ణయాలు. బీఫ్…
దాసరి ‘మళ్ళీ పుట్టాడు’!
ప్రేక్షకుడికి కనపడని వాడూ, వినపడని వాడూ దర్శకుడు. ఈ నిర్వచనం దాసరి నారాయణరావు వచ్చేంత వరకే. తర్వాత మారిపోయింది. దర్శకుడు క.వి( కనిపించి వినిపించేవాడు) అయిపోయాడు. దర్శకుడిగా వుంటూ కూడా ఎక్కడో అక్కడ చిన్న పాత్రలోనయినా ఆయన తళుక్కున మెరిసేవారు. సినిమా అయ్యాక కూడా చిన్న ‘లెక్చరిచ్చి’ కానీ, వదలే వారు కారు. నాయకానాయికలు కలసిపోయి,…
బూటుకాలి కింద ‘బూడిద’ లేదంటారా?
తలుపు తెరిచే వుంది. ఏం లాభం? అడ్డుగా కర్టెన్. పేరుకే పారదర్శకత. కానీ అంతా గోప్యం. ఇదీ మన ప్రజాస్వామ్యం. అన్నీ వ్యవస్థల్నీ అనలేం కానీ, కొన్నింటిలో అయితే మామూలు తెరలు కావు, ఇనుప తెరలు వుంటాయి. అలాంటివే రక్షణ, న్యాయ వ్యవస్థలు. అవి సామాన్యమైన వ్యవస్థలా? ఒకటి దేశాన్ని కాపాడేదీ; మరొకటి వ్యక్తిని కాపాడేది.…
దిగ్వివాద సింగ్!
మహరాజునే వెలి వేస్తే….!?
వేదం వినాలనీ, వేదం అనాలనీ..నేడు పెద్దగా ఎవరికీ అనిపించక పోవచ్చు. అర్థం తెలుసుకోవాలనే యావ కూడా ఎవరికీ వుండక పోవచ్చు. పెద్ద పెద్ద ఉత్సవాల్లో, కడకు సర్కారీ ఉత్సవాల్లో వేద మంత్రోచ్చరణలు లేక పోతే వెలితిగా భావిస్తారేమో కానీ, తీరా పఠిస్తే పట్టించుకోరు. మీడియా ప్రతినిథులు కూడా ఉత్సవాల్లో నాయకులేం మాట్లాడతారో వింటారు కానీ, వేద…
మిరపా..! మిరపా..! ఎందుకు ‘మండా’వ్?
‘ఆప్’ వింద్ ’చీపురు‘వాల్!
పేరు : అరవింద్ కేజ్రీవాల్ దరఖాస్తు చేయు ఉద్యోగం: ఏక్ నిరంజన్ ( ఢిల్లీ మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికల తర్వాత ఒక్కొక్కరు పార్టీని విడిచి వెళ్ళిపోతున్నారు. ఎవరు వెళ్ళిపోయినా సరే.. ఒంటరి పోరుకు సిధ్ధపడుతున్నాను.) వయసు : పోరాడే వయసు.. పాలించే వయసు కాదు. ఈ విషయాన్ని ఢిల్లీ పౌరులు ఇప్పటికి గుర్తించారు. తొలి సారి…