పిడికిలిని బిగించటం సులువే; సడలించకుండా వుండటమే కష్టం. అలా ఎంతసేపని బిగించి వుంచగలరు? కొన్ని గంటలు, లేదా కొన్ని రోజులు, కాకుంటే కొన్ని వారాలు. ఇదేమిటి? ఏకంగా ఏడాది పాటు సడలకుండా వుండటమేమిటి? చర్మాన్ని వాన తడిపేసినా, వేళ్ళను వాన కొరికేసినా, ముంజేతిని ఎండ కాల్చేసినా అదే బిగింపు. రైతు పిడికిలి. అయినా బెట్టు. ‘అధికారం…
Tag: BJP
తెలుగు నాట ‘చిన్న’ బోయిన జాతీయ పార్టీలు!
తెలుగు రాష్ట్రాలు వేరయినా, ఒక రాష్ట్రంలోని రాజకీయాల ప్రభావం మరొక చోట పడుతూనే వుంది. నాలుగేళ్ళ తర్వాత ఈ ముద్ర మరింత పెరిగింది. ప్రాంతీయ వైరాలు- నేతల్లో సరేసరి- ప్రజల్లో తగ్గాయి. రాష్ట్రం ‘సమైక్యం’గా వున్నప్పటి అపోహలు ‘వేరు పడ్డాక’ తగ్గాయి. కాపురాలు వేరయ్యాక కలయకలు పెరిగాయి. తెలంగాణ కాస్త ముందుగా ఎన్నికలకు వెళ్ళటంతో ఈ…
ముంచుకొస్తున్న ‘భయమే’ ముందస్తుకు కారణం!
అయిదేళ్ళ సభను ముందే రద్దు చేసి, మరో అయిదేళ్ళ అధికారాన్ని కోరుతున్నారు కేసీఆర్. అయినా ఈ ఎన్నికలను ‘ముందస్తు’ అనకూడదు. అంటే ఆయనకు కోపం వస్తుంది. ఎంత ముందయితే ‘ముందస్తు’ అనవచ్చో మరి? ఇంకా ఎనిమిది నెలలు (అయిదురోజులు తక్కువ లెండి) పదవీ కాలం వుందనగా ఎన్నికలకు వెళ్తున్నారు. అంటే, కేవలం ముందుగా కాదు, బాగా…
’కాషాయం‘ వదలిన చోటే, వాజ్ పేయీ హీరో!
కరుణానిధి కన్నుమూసిన కొన్ని రోజులకే వాజ్‌పేయీ తుదిశ్వాస విడిచారు. ఇద్దరి మధ్యా పోలికలే కాదు.., పోలికల్లో వ్యత్యాసాలూ,వ్యత్యాసాల్లో పోలికలూ వున్నాయి. ఇద్దరూ తొమ్మిది పదులు దాటి జీవించారు. ఇద్దరూ మంచి వక్తలే. కాకుంటే కరుణ తమిళలంలో దంచేస్తే, వాజ్ పేయీ హిందీలో ఊపేస్తారు. ‘ఏ రాష్ట్రమేగినా’ ఒకరు తమిళం తప్ప హిందీని ముట్టరొకరు. ‘ ఏ…
‘పొత్తేష్’ కుమార్!
నా పేరు : నితిష్ కుమార్ దరఖాస్తు చేయు ఉద్యోగం: మధ్యలో ఎన్నిసార్లు మానుకున్నా మళ్ళీ అదే ఉద్యోగం:బీహార్ ముఖ్యమంత్రి. ఒకప్పుడు ప్రధాని మంత్రికి దరఖాస్తు చెయ్యాలనుకున్నాను. ‘గుజరాత్ సీఎంగా వున్న మోడీ పీఎం కాగలిగినప్పుడు, నేనెందుకు కాకూడదు?’ అని అనుకున్నాను. అది మోడీ మనసులో పెట్టుకుంటే, నేను సీఎం కావటం కూడా కష్టమే..అది వేరే…
సమరంలో హీరో! ‘ఉప’సమరంలో జీరో!
బీజేపీ పెరుగుతోందా? తరుగుతోందా? పెరిగి తరుగుతోందా? ఈ పార్టీకి ‘సమరం’ అనుకూలించినట్లుగా, ‘ఉప సమరం’ అనుకూలించటంలేదు. ఎన్నికల్లో రెపరపలాడే కాషాయ పతాక, ఉప ఎన్నికల్లో మాత్రం తలవాల్చేస్తోంది. ఇది ఇప్పటి విషయం కాదు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించి, వెంటనే మొదలయిన ఉపఎన్నికల నుంచీ, ఇదే వరస. అవి పార్లమెంటు స్థానాలకు చెందిన ఉప…
‘నెలవంక’య్య నాయుడు
పేరు : ఎం.వెంకయ్య నాయుడు
దరఖాస్తు చేయు ఉద్యోగం: ‘సీమాంధ్ర చాంపియన్-4’ ( మొదటి మూడు స్థానాలు నిండిపోయాయి. జగన్, కిరణ్, బాబులు వాటిని సాధించారు. అయినా సరే, ప్రయత్నిస్తే ఎప్పుడోకప్పుడు మొదటి స్థానానికి చేరక పోతామా- అన్నది పట్టుదల)
ముద్దు పేర్లు : ‘నెల వంక’య్య నాయుడు.( అవును. నెలవంక అంటే ‘చంద్రుడే’. తెలుగు ‘చంద్రుడే’. బీజేపీతో తెలుగుదేశం పొత్తు పెట్టుకోవాలనుకున్నప్పుడెల్లా, చంద్రాబునాయుడుతో మాట్లాడటానికి, వెంకయ్య నాయుడు- అను నాతో పని వుంటుంది కదా)
‘హిందీ’త్వ మోడీ
పేరు : నరేంద్ర మోడీ
దరఖాస్తు చేయు ఉద్యోగం: భారతీయ(జనతా) ప్రధాని
ముద్దు పేర్లు : మూడీ(వోటర్ల మూడ్స్ మారుస్తానని) త్రీడీ( మూడు సార్లు గెలవటమే కాదు, త్రీడీలోప్రచారం చేశానని), కేఢీ(అపార్థం చేసుకోకండి. ‘కే’ అంటే కేశూభాయ్ పటేల్, గుజరాత్‌లో రాజకీయ భీష్ముడు. ఆయన్నే ఎదుర్కొన్నాను.)
విద్యార్హతలు : బి.పి.ఎల్( అంటే ఐపిల్ అనుకునేరు. కానీ కాదు. బ్యాచిలర్ ఆఫ్ పోల్ మేనేజ్‌మెంట్. వోట్లు ఎలా వేయించుకోవాలో తెలిపే శాస్త్రం.) రాజనీతి శాస్త్రంలో నేను చేసిన మాస్టర్స్ డిగ్రీ కంటె ఇది పెద్దది.
HAS BAPU JOINED BJP?
After Mandir and Kargil, the Saffron Brigade has found another pretext to light their tails and set the enemy camp ablaze: Corruption. Yes, this is highly inflammable.
Head after head of burning effigy of 2G Ravana is tumbling down. Though every Indian political outfit is corrupt, BJP is trying its best to single out UPA, if not Congress