అవసరాల మధ్యనే జీవిస్తుంటాం. అవసరాలు తీర్చుకోవటమే జీవిస్తుంటాం. తిరిగి అవసరాలను అన్వేషిస్తూనే జీవిస్తుంటాం.చెయ్యటానికో ఉద్యోగం, ఉండటానికో ఫ్లాటూ, తిరగటానికో కారు. తోడుకో సహచరీ లేదా సహచరుడూ, గొప్పలు పోవటానికి పిల్లలూ, వాళ్ళ ప్రాగ్రెస్ రిపోర్టులూ.. ఇవన్నీ అవసరాలే.ఇన్ని అవసరాల్లోనూ ఆవేశం కూడా అప్పుడప్పుడూ అవసరమయిపోతుంటుంది. దీనిని తీర్చిపెట్టటానికి కోట్లకు పడగలెత్తే వినోద పరిశ్రమ వుంటుంది. ఎప్పుడు…