(దారం తెగినంత సులువుగా అనుబంధాలు తెగిపోతున్నాయి. తల్లీబిడ్డలూ, అన్నదమ్ములు, భార్యాభర్తలు ఎక్కడికక్కడ విడివిడిగా పడివున్నారు. అశోకుణ్ణి మార్చేసిన యుధ్ధరంగం కన్నా బీభత్సంగా వుంది. మనిషి మీద మార్కెట్ గెలుపు. ఓడిన మనిషి కూడా గెలిచినట్టు సంబరం. ఎవరికి ఎవరూ ఏమీ కానీ చోట ఏమని వెతుకుతా..?)
పాలసీసా ఇవ్వకండి
నోటి దగ్గర
కరెన్సీ నోటు పెట్టండి
కిలాకిలా నవ్వుతుంది
అమ్మ ఒడిలో ఏముంది..?
అన్నీ అంగడిలోనే
-సతీష్ చందర్
(ఆంధ్రభూమి దినపత్రికలో ప్రచురితం)
అన్నా!చాలా బాగుంది కవిత. కవిత్వ వ్యాఖ్యానంకూడా బాగుంది. జాలాది పై రాసిన “కవులు వేలాది! నిలిచేది జాలాది!!”వ్యాసం చాలా బాగుంది. మీ సైట్ ను అనుసరిస్తున్నాను. ప్రపంచ తెలుగు మహా సభలో మీరు మాట్లాడింది విన్నాను. పోస్టింగ్ చదివాను. ఉంటాను.
అక్షరం మెదడు నుండి అరచేతిలోకి జారి వేళ్ళ ద్వారా కాగితంపై సేదదీరుతుంది. నాకు తెలిసి ప్రతి అక్షరం మీ మెదడులోకి రాగానే సేదతీరుతుందేమో! అభినందనలు!.
మీ కవితకోసం ప్రతి రోజూ ఎదురుచూస్తాను నిజం!
iam very much interst in this type of poetry . could do u please advise me some web pages like this
from
N.Ramesh