మహావృక్షం

చెట్టు
(photo by Andrews)


నిన్న
విరగ కాచిన చెట్టే.
నేడు వుత్త ఆకులతో
గాలి మాత్రం వీస్తోంది.
ఎవరో వృధ్ధుడు
తనలో తాను గొణిగినట్లు.
శ్రోతలులేని మహావక్తలాగే
ఫలాలు లేని మహావృక్షం
పలుకరించే వారు లేక!

-సతీష్ చందర్
(‘ప్రజ’దినపత్రికలో ప్రచురితం)

4 comments for “మహావృక్షం

Leave a Reply