మెత్తని సంభాషణ!

కఠినంగా ఏది కనిపించినా మనం ఊరుకోం. కొబ్బరి పెంకును బద్దలు కొట్టి మెత్తని తెల్లదనాన్ని చూస్తాం. రాయి కఠినం. చెక్కేసి ఒక సుకుమారిని చేసేస్తాం. ప్రపంచమంతా పైకి కఠినమే. పై కవచాన్ని తొలిచేస్తే లోన పసిపాపే. అప్పడు భూగోళాన్ని ఒళ్ళోకి తీసుకోవచ్చు. అరమరికలు మరచి ముద్దాడ వచ్చు. ఈ భోగం ఒక కవి కి తెలుస్తుంది. తప్పితే తెలిసేది కళాకారుడికే.

Photo By: Reg Natarajan

పువ్వు వికసిస్తుంది

మెత్తగా.

కొవ్వొతి వెలుగుతుంది

మెత్తగా.

నవ్వు గుబాళిస్తుంది

మెత్తగా.

మెత్తనయిన

ప్రతి మాటా

కవిత్వమే.

-సతీష్ చందర్

(ప్రజ దినపత్రిక లో ప్రచురితం)

2 comments for “మెత్తని సంభాషణ!

  1. మీ వ్యంగ్యం కూడా మెత్తని కత్తి కోతే సతీష్ చందర్ జీ-మీ వీరాభిమాని-కర్లపాలెం హనుమంత రావు

Leave a Reply