రాజకీయాల్లో ‘క’ గుణింతం!

కేకే కేరికేచర్:బలరాం

‘గురూజీ?’
‘వాట్ శిష్యా!’

‘తెలంగాణ ఉద్యమం అంతా ‘క’ గుణింతంతో నడుస్తున్నట్టున్నది..?’
‘అంటే ఏమిటి శిష్యా..!?’

‘ఏముందీ..? తెలంగాణ ఉద్యమ నేతల పేర్లు తీసుకోండి. ఇప్పుడు ‘కేకే’ ఉన్నారు. నిన్నటి దాకా ‘కాకా’ కూడా చురుగ్గా వుండేవారు. ఇక ‘కే’సీఆర్ కుటుంబమంతా ‘క’ గుణింతమే.‘కేటీఆర్’, ‘కవిత’లతో పాటు. కడకు తెలంగాణ జాక్ ను నడిపే ‘కో’దండ రామ్ కూడా. ఇక తెలంగాణ కోసం ఈ మధ్య రాజీనామా చేసిన ‘కో’మటి రెడ్డి కూడా ‘క’ గుణింతంలోకే వస్తారు గురూజీ..’
‘ఓహో! నేనంత దూరం వెళ్ళలేదు.. ఇంత కీ నీ ‘క’ పరిశోధన అంతరార్థం ఏమిటో శిష్యా..?!’

‘అది మీరే చెప్పాలి గురూజీ? ఈ ‘క’ దేనికి సంకేతం గురూజీ..?’
‘క- అంటే ఇక్కడ కదనం… అంటే.. యుధ్ధానికి సంకేతం శిష్యా..!’

‘ఆగండి. ఈ ఉద్యమాన్ని ఎదుర్కొన్నదీ ‘క’ గుణింతమే..ఎవరో చెప్పుకోండి గురూజీ?’
‘ఎవరు శిష్యా..?

’కి.కు..!’
‘అంటే.. ఎవరు శిష్యా..?’

‘ఇంకెవరు..? కిరణ్ కుమార్ రెడ్డి.. వీరి ‘క’ గుణింతానికి అర్థం చెప్పండి.’
‘…………!’

‘కాలయాపన..! కాదంటారా.. గురూజీ..?’
‘నాకు తెలియదు శిష్యా..!’

-సతీష్ చందర్

1 comment for “రాజకీయాల్లో ‘క’ గుణింతం!

Leave a Reply