
వెళ్ళీ వెళ్ళగానే
నా వస్త్రాల్ని వలిచింది
పసివాణ్ణయ్యాను
ఎవరూ లేరే..అని అనుకుంటాం అప్పుడప్పుడూ. నాకు నేనూ, మీకూ మీరూ క్షణంలో హాజరు. అవును కదా! నాతో నేను మాట్లాడి ఎన్నాళ్ళయింది? దేని గురించి మాట్లాడను- అని అనుకుంటాను ముఖం కడుక్కోవటానికి టాప్ విప్పుతూ…! నీళ్ళు.. చేతుల్ని తడిమేస్తూ. జల స్పర్శ! ఏదో గుర్తు. చిన్నప్పటి జ్ఞాపకం. అందరూ ఆడుతూనే వున్నారు. నా ముంజేతి మీద పెద్ద చినుకు. వాన పిల్ల పెట్టిన తొలిముద్దు. వాళ్ళకింకా తెలీదు- కాస్సేపేట్లో మేం ‘వానా, వానా వల్లప్పా ఆడబోతున్నామని…!’ నీరు గుర్తొస్తే చాలు, నాలోకి నేను వెళ్తూ, మీలోకి మిమ్మల్ని పంపిస్తాను. నా బెంగను మీ బెంగగా చేసేస్తున్నాను. మన్నించండి.
నాభి మీద కొడితే రావణాసురుడు కూలి పోతాడు.
నాభి దాటి వచ్చి తొడల మీద కొడితే దుర్యోధనుడు కూలిపోతాడు.
రెండూ ‘బిలో ది బెల్ట్’ పధ్ధతులే.
యుధ్ధనీతి తప్పటమే రాజనీతి!
పోతూ, పోతూ.. రావణాసురుడు పదితలల్లోని పదినోళ్ళతో రాజనీతి చెప్పాడంటారు. ఏమి చెప్పాడో? అప్పుడు ఏమో కానీ, ఇప్పుడయితే, రాజకీయాల్లో దెబ్బతిన్న ఏ
రాజనీతిజ్ఞుడయినా చెప్పే నీతి ఒక్కటే వుంటుంది:
కనకం, కులం, కుటుంబం- ఏ మూడూ కలిస్తేనే రాజకీయం.
పేరు : నందమూరి తారక రామారావు( జూనియర్)
దరఖాస్తు చేయు ఉద్యోగం: వారసుడు (సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా)
ముద్దు పేర్లు : కుర్ర తాత( తాత ఎన్టీఆర్ మనవడి ఎన్టీఆర్‌ను -తాతా- అని పిలిచేవాడు లెండి), జూనియర్( సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ ‘సీనియారిటీ’ అన్ని వేళలా నిలవదు. బాబాయ్‌లు అబ్బాయ్ లు కావచ్చు, అబ్బాయ్‌లు బాబాయ్‌లు కావచ్చు.) తాతకు తగ్గ మనవడు. నం’దమ్మూ’రి!
నవ్వూ మందే.
ఇది తెలిసి పోయాక, పార్కుల్లో పువ్వులు బదులు, నవ్వులు పూసేస్తున్నాయి. చెట్లు కాదు, చెట్లంతంటి మనుషులు నవ్వేస్తున్నారు. ఎవరో చచ్చిపోతే, గుమిగూడి ఏడ్చినంత బిగ్గరగా గుండెలు పగిలేలా నవ్వేస్తున్నారు. ఇంకా చీకట్లు విడిపోకుండా, తెల్లవారకుండానే, క్రోటన్ పొదల మాటను తెల్లని దుస్తులతో, నిలబడి నవ్వుతుంటే, విఠలాచార్య తీసిన పాత సినిమాల్లో ‘కామెడీ దయ్యాలు’ నవ్వినంత విలాసంగా నవ్వేస్తున్నారు. చెమటోడ్చి, దిక్కులు పిక్కటిల్లేలా నవ్వేస్తున్నారు.
ఎన్నికలంటే ఏమిటి?
హామీలూ, వరాలూ, తిట్లూ, శాపనార్థాలూ – ఇవి కదా!
కానీ, కేసులూ, ఖాతాల స్తంభనలూ, ఆస్తుల జప్తులూ, అరెస్టులూ… ఇవేమిటి?
ఎన్నికలప్పుడు- పలు అధికారాలు ప్రభుత్వం నుంచి ఎన్నికల కమిషన్(ఇసి) కొచ్చేస్తాయి. అందుచేత ఈ వేళల్లో ఆ సంస్థే తీర్పరిగా వుంటుంది. కానీ ఇప్పుటి (18 అసెంబ్లీ స్థానాల) ఉప ఎన్నికలు చూడండి. హడావిడి ‘ఇసి’ కాదు. అంతా ‘సిబిఐ’ దే.
వోటర్లకు చేతులు కాలాయి. ఏం పట్టుకోవాలి? తమిళ వోటర్లయితే ‘ఆకులు’ పట్టుకున్నారు.( జయలలిత పార్టీ అన్నా డిఎంకె గుర్తు రెండు ‘విడాకులు’ లెండి.) తెలుగు వోటర్లయితే .. అందునా తెలంగాణ వోటర్లయితే ‘పూలు’ పట్టుకోవచ్చు. అయితే ఏ పూలు పట్టుకోవాలన్నది సమస్య. మొన్నటి దాకా తెలంగాణ మొత్తానికి ఒకే ఒక పువ్వు వుండేది. అదే (టీఆర్‌ఎస్) ‘గులాబీ’ ఇప్పుడు ఇంకొక పువ్వొచ్చి పడింది. అదే (బీజేపీ) ‘కమలం’. అయితే తెలంగాణ ఉద్యమానికి సారథ్యం వహించిన ‘జేయేసీ’ కోదండ రామునికి కొత్త సమస్య వచ్చింది. తెలంగాణ తల్లి దగ్గర నిలబడి దగ్గర వారం రోజులుగా ఒకే కీర్తన ఆలపిస్తున్నారు.
పేరు : చిరంజీవి
దరఖాస్తు చేయు ఉద్యోగం: కేంద్ర మంత్రి (గతంలో మా సామాజిక వర్గానికి చెందిన సినీ దర్శకుడికచ్చారే అలా..)
ముద్దు పేర్లు : ఆటు పోట్లకు వీలుగా రెండు పేర్లున్నాయి. హిట్టయితే ‘మెగా’, ఫ్లాపయితే ‘చిరు'(సినిమాల్లో అయినా, రాజకీయాల్లో అయినా ఇవే ముద్దు పేర్లు). తిరుపతిలో పోటీ చేసి గెలిచినప్పుడు మాత్రం కొందరు- ‘ఆహా! ‘తిర’ంజీవి అన్నారు. ఇప్పుడా సీటు పోతే పత్రికల వాళ్ళు – కాంగ్రెస్ కు ‘తిరు’ క్షవరం అని హెడ్‌లైన్లు పెట్టరు. ‘చిరు’ క్షవరం అంటారు… అదీ నాబెంగ
వోటు హక్కూ, వోటు హక్కూ- అని ఎవరూ గొంతు చించుకోనక్కర్లేదు.
వోటు హక్కు అంటే- వోటు కొనే హక్కూ, వోటు అమ్మే హక్కూ- అని వోటు రాని వాడిక్కూడూ తెలిసిపోయింది. ఎటొచ్చీ ఏ రేటుకి అమ్మాలీ, ఏ రేటుకి కొనాలీ- అన్న విషయంలోనే గందరగోళం- వుంది.
అన్నింటా బక్క వాడే నష్టపోతున్నాడు. పండిన పంట అమ్ముకోవటానికి పేద రైతుకు ఎన్ని కష్టాలున్నాయో- పేద వోటరుకి కూడా అన్ని కష్టాలున్నాయి. పంటకన్నా ‘మద్దతు ధర’ ఒకటి వుంటుంది. కానీ వోటుకి అలా కాదే..! ఏ రేటిస్తే, ఆ రేటే యిచ్చుకోవాలి.
‘ఇదేమి దురన్నాయం బాబూ!’ అంటే పట్టించుకునే నాధుడే లేడు.
పేరు : భాను కిరణ్
దరఖాస్తు చేయు ఉద్యోగం: ‘డాను’ కిరణ్( అవును. డాన్‌ను కావాలనుకున్నాను.)
ముద్దు పేర్లు : ‘గన్ను’ పోటు దారు.(నమ్మిన వ్యక్తిని వెనకనుంచి పొడిచినప్పుడు, రాజకీయాల్లో అయితే వెన్నుపోటు అంటారు. మా మాఫియా భాషలో ‘గన్ను’ పోటు అంటారు. కానీ రాజకీయంగా ‘మామ’ను పొడిచిన అల్లుళ్ళు కూడా నన్ను ఆడిపోసుకుంటున్నారు. అదే నాకు బాధగా వుంది.
మొన్న అవినీతి!
నిన్న మతం!
నేడు నేరం!
అన్నీ బాంబులే! ‘చంద్ర బాంబులే’! జగన్ మీద విసిరిన ‘దీపావళి’ బాంబులే!
ఒక్కటీ పేలలేదు. అన్నీ తుస్సుమన్నాయి.
ఇంకేం చేస్తారు?
పాత పాటే. ‘ఆల్ ఫ్రీ’! బియ్యం ఉచితం! నిరుద్యోగులకు నెలకు వెయ్యి. ఇలాంటి హామీలు ఇచ్చేస్తానంటున్నారు. ఇదేదో ఉపకార వేతనం అనుకునేరు! ‘ఉప’ ఎన్నికల వేతనం.
ఎదగ వచ్చు.
ఎవ్వరు ఎలాగయినా ఎదగ వచ్చు. నిలువుగా ఎదగవచ్చు. అడ్డంగా ఎదగవచ్చు.
లేదూ ముందు అడ్డంగా ఎదిగి, తర్వాత నిలువుగా ఎదగ వచ్చు.
ఎదగటం- ముఖ్యమనుకుంటే చాలు.
పదోతరగతి తప్పిన కుర్రాడు బస్సెక్కుతాడు. అతని కళ్ళ ముందే ఒక పెద్దాయన తన స్టాపులో గబగబా దిగిపోతుంటాడు. పర్సుజారి కుర్రాడి కాళ్ళ మీద పడుతుంది. తీసి కళ్ళకద్దు కుంటాడు. ‘తిరిగి పెద్దాయనకు ఇచ్చే వాణ్ణే కానీ, దిగి వెళ్ళిపోయాడు కదా!’ తనకు తాను సంజాయిషీ ఇచ్చుకుంటాడు. పర్సులో వెయ్యి. తర్వాత ఇలాగే బస్సు ఎక్కుతుంటాడు. ఎవరూ అతని కోసం పర్సు పారేసుకోరు. ఈ సారి తనే ఎవరి పర్సో కొడతాడు. పని తేలికయి పోయింది. తర్వాత కొంపలు కొడతాడు. అలా దొంగ పర్మిట్లూ, దొంగ కాంట్రాక్టులూ కొట్టి శత కోటీశ్వరుడయి పోతాడు. ఇంత వరకూ ఎదిగింది నిలువుగా.
‘కుట్టాలని వుంది.’
‘ఎవర్నీ? నన్నా?’
అనగనగా దోమ గురించో, చీమ గురించో చెబుతున్నట్టనిపిస్తుంది కదూ? కానీ కాదు. మనిషి గురించే. కాకుంటే కుట్టే మనిషి గురించి. కుట్టే మనుషులంటారా? ఉండటం ఏమిటి అదో వృత్తి. అలాగని ఏ టైలరింగో, ఎంబ్రాయిడరో అనుకునేరు. ఆ కుట్టటం వేరు. ఇంగ్లీషులో ఆలోచిస్తే ‘స్టిచ్’ చేయటం వేరు.
ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది ‘స్టింగ్’ చెయ్యటం గురించి. ఇదీ కుట్టటమే. కాకుంటే సూది లాంటి అవయవాన్ని వాటంగా దించి, గుటుక్కున గుక్కెడు రక్తం తాగెయ్యటం. ఇలా చేసేటప్పుడు మత్తిచ్చే ఏర్పాటు కూడా వుంటుంది కాబట్టి, ఇది ‘ఆపరేషన్’ కిందికి కూడా వస్తుంది. వెరసి మొత్తం ప్రక్రియను ‘స్టింగ్ ఆపరేషన’్ అంటారు.
కవి వస్తాడు.
చూడాలి. ఎదురు చూడాలి.
ఎలా చూడాలి?
సూర్యుణ్ణి దర్శించినట్లు కాదు, చంద్రుణ్ణి వీక్షించినట్లు చూడాలి.
భళ్ళున తెల్లారినప్పుడు, కిటికీలో భానుణ్ణి ముఖం చిట్లించి చూస్తాం. కానీ నెలవంకను చెట్ల కొమ్మల చిగురుటాకుల సందుల్లోంచి చిరునవ్వుల్తో చూస్తాం.
మండే వాడని తెలిసి కూడా రవిని ఒక్క సారి చూసేస్తాం. మెత్తనిదని తెలిసి కూడా జాబిల్లిని వెతుక్కుంటూ, అంచెలంచెలుగా చూస్తాం.
కవిని చందమామను చూసినట్లు చూడాలి.
అజంతా శిసాగర్‌ను అలాగే చూశాడు.
‘తార’ల్ని సృష్టించ వచ్చు. కూల్చేయ వచ్చు.
చాలా తారలు స్వయంప్రకాశకాలు కావు. ముఖ్యంగా వెండితెర మీద తారలు అస్సలు కారు. ముఖానికి అంగుళం మందాన మేకప్ కొట్టి, ఫ్లడ్‌లైట్లు వేస్తేనే కానీ కనిపించరు.
వాళ్ళు కొట్టే పంచ్ డైలాగుల్లో, పంచె వాళ్ళదీ కాదు, డై’లాగూ’ వాళ్ళది కాదు. ఎవరో డైలాగ్ రైటర్‌ది.
కడకు స్వరమూ వాళ్ళది కాదు. ఎవరో ‘స్వరదాత’ డబ్బింగ్ చెప్పాల్సిందే.
Dinesh Reddy, the DGP of AP is eyeing for the Director post in the CBI, it is reliably learnt. This is one of the most coveted posts, which every senior police officer in the nation dreams of. Unlike some of his predecessors, Dinesh as, the top cop of the state, is independently discharging his duties and has become an eye sore to his batch mates.