
The so called truce that was made between the Chief Minister Kiran Kumar Reddy and his adversaries in the party in Delhi has not lasted long. The unyielding CM revived his headhunt in less than a week after he returned from Delhi.
పాఠమైనా, గుణపాఠమైనా, మార్పు కోసం.
కానీ, క్లాసు పీకుడు, యధాతథ స్థితి కోసం.
పాఠం మిత్రులకు చెబుతాం, గుణ పాఠం శత్రువులకు చెబుతాం.
మిత్రులూ, శత్రువులూ కానీ సన్నిహితులు వుంటారా? ఉంటారు. వారే మన నీడలు.
మిత్రుడూ మారొచ్చు. శత్రువూ మారొచ్చు. కానీ నీడ మారదు. మనం మారకుండా. మన నీడలు మారాలనే దురాశ లోనుంచే ఈ ‘క్లాసు పీకుడు’ పుట్టింది.
పువ్వు కోసమే చెయ్యి చాపేది. కానీ ముల్లు గుచ్చుకుంటుంది. హఠాత్తుగా నిద్రలేచి కిటికీలోంచి చూస్తే.. నింగిలో ఎర్రని నారింజ. ఉదయమే అనుకుంటాం. కాని అది సాయింత్రం. రేపటి కోసమనే.. ఒక తుపాకీ తోనో, పెట్రోలు డబ్బాతోనో బయిలు దేరతాం.. ఆగి చూసుకుంటే నిన్నలో వుంటాం. అడుగులే కదా, అని వేసేయకూడదు. ముందుకో, వెనక్కో ..తెలుసుకోవద్దూ. లేకుంటే ఖరీదయిన త్యాగం కాస్తా, సాదాసీదా మరణమయిపోతుంది.
రాష్ట్రంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు దొందూ దొందే. ‘హౌస్’లో (శాసన సభలో) నిండుగా కనిపిస్తారు. కానీ ‘బరి’లోకి దించితే ఒక్కరూ మిగలటం లేదు. కానీ వైయస్సార్ కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లకు ‘హౌస్’ లో ప్రాతినిథ్యం అంతంత మాత్రమే. కానీ ‘ఉప ఎన్నికల బరి’లోకి దించితే ఎన్నికల ‘బాక్సు’లు ఫుల్లు! అందుకే ‘ఉప ఎన్నికల’ంటే ఆ రెంటికీ ప్రాణసంకటం, ఈ రెంటికీ చెలగాటం.రేపు జరగబోయే ఒక పార్లమెంటు,18 అసెంబ్లీ స్థానాలకు జరిగే ‘ఉప ఎన్నికల’ ఫలితాలు ఊహించినట్టే వుంటాయా?
ప్రవేశ పరీక్షలు రాజకీయాల్లో కూడా తప్పవు.
ఏ పార్టీ నేతయినా నేడు తెలంగాణలో ప్రవేశించాలంటే, ప్రవేశ పరీక్ష రాయాల్సిందే. ఈ పరీక్షలో ఒకే ఒక పేపరు. ఆ పేపర్లో ఒక్కటే ప్రశ్న. ‘ప్రత్యేక తెలంగాణ ఏర్పాటును సమర్థిస్తారా?’ అందులో సమాధానాలు రెండు: అవును, కాదు. ఈ రెంటిలో ఒక్కటే టిక్కు పెట్టాలి. అలా కాదని ఏ సమాధానం రాసినా పరీక్షలో తప్పుతారు. పరీక్ష తప్పిన వారికి ప్రవేశం వుండదు.
పేరు : జేసీ దివాకర రెడ్డి
దరఖాస్తు చేయు ఉద్యోగం: రాయల తెలంగాణ ముఖ్యమంత్రి
ముద్దు పేర్లు : దివాకర ‘రాయలు'( రాయల తెలంగాణ వస్తే తానే శ్రీకృష్ణ దేవ రాయలు లాగా ‘భువన విజయం’ చేయవచ్చు.
విద్యార్హతలు : మాస్టర్ ఆఫ్ బ్రేకింగ్ అండ్ వెల్డింగ్( కలిసిన వాటిని విరచగలరు. విడిపోయిన వాటిని అతక గలరు. (ఆంధ్రప్రదేశ్‌ను మూడుగా విభజించి, రెంటిని అతికి- రాయల తెలంగాణ- చేయాలన్న సంకల్పం అలా వచ్చిందే
తీర్పులు ఎక్కడయినా ఒక్కటే. అవి ఓర్పునకు పరీక్షలు.
కోర్టులో న్యాయమూర్తి ఇచ్చే తీర్పుకూ, ఎన్నికల్లో వోటరు ఇచ్చే తీర్పుకూ పెద్ద తేడా వుండదు.
ఒకడు గెలుస్తాడు. ఇంకొకడు వోడిపోతాడు. కానీ చిత్రం. ఇద్దరూ ఏడుస్తారు. వోడిన వాడు కోర్టు ఆవరణలోనే ఏడ్చేస్తే, గెలిచిన వాడు ఇంటిక వెళ్ళి ఏడుస్తాడు. కారణం? కేసుఖర్చుల కోసం సమానంగా కొంపలు ఆర్పుకునే వుంటారు.
పేరు : రాహుల్ గాంధీ
దరఖాస్తు చేయు ఉద్యోగం: మంచి కొడుకు( ఇంతకు ముందు ఈ పోస్టు నాదే. కానీ యుపి ఎన్నికల తర్వాత అఖిలేష్ యాదవ్ కొట్టేశాడు.)
ముద్దు పేర్లు : ‘ఉత్తర’కుమారుడు (అంటే ఉత్తర ప్రదేశ్‌లో ప్రచారం చేసిన సోనియా కుమారుడని అర్థం కాదు. గెలిచేస్తానని ప్రగల్బాలు పలికి చతికిలబడ్డ భారతంలోని ఉత్తర కుమారుణ్ణే)
విద్యార్హతలు : బ్యాచిలర్ ఆఫ్ పెయిల్యూర్స్ (ప్రచార రాజకీయాల్లో వరుస వైఫల్యాలు చూస్తూ, ‘బ్యాచిలర్’ గానే వుండి పోయాను. ప్రధాని అయ్యాక పెళ్ళికొడుకునవుదామన్న కోరిక నెరవేరటం లేదు.
రైళ్ళు పట్టాలపైనా, బస్సులు రోడ్లపైనా, విమానాలు మబ్బులు పైనా నడుస్తాయని- చెబితే ఎల్‌కేజీ కుర్రాడు కూడా నమ్మడు. వాహనం ఏదయినా నడిచేది ఢరల పైన.
కేంద్రంలో ఒకప్పటి ఎన్డీయే సర్కారయినా, ఇప్పటి యుపీయే ప్రభుత్వమయినా నడిచేది పాలసీల మీద కాదు. ఉత్త పొత్తుల మీద.
అటు వాహనాలకూ, సర్కారుకూ సంబంధం వుందేమో! అబ్బే అవేమన్నా మోకాలూ, బోడిగుండూనా? ఉండనే ఉండదు- అని అనిపిస్తుంది. కానీ నిజం కాదు. రైల్లో ప్రయాణిస్తూ ఒక్క సారి గొలుసు లాగి చూడండి. ఆగేది రైలు కాదు. సర్కారు.
రోజూ పెళ్ళయితే, పెళ్ళిలేని రోజే పండగ రోజవుతుంది. ఆ లెక్కన చూస్తే తెలుగు వోటరు నిత్యపెళ్ళికొడుకే. తెలుగు నేలను చూడండి. నిత్యకళ్యాణం పచ్చతోరణంలాగా కళకళ లాడిపోవటం లేదూ? అసలు అసెంబ్లీయే కళ్యాణ మంటపం లా వుంది.( ఇంతటి శోభను చూసి కూడాకొందరు గౌరవ నేతలు చట్ట సభల్ని అగౌరవపరుస్తూ, ‘ఆ దొడ్డీ.. ఈ దొడ్డీ’ అంటూ వ్యాఖ్యలు ఎలా చెయ్యగలుగుతున్నారో అర్థం కావటం లేదు.). పెళ్ళి ప్రమాణం చేసినంత గొప్పగా, ఏదో ఒక వ్యక్తి శాసన సభ్యుడిగా ప్రమాణం చేస్తూనే వున్నాడు. అదే పెళ్ళి.. మళ్ళీ మళ్ళీ. అదే శాసనసభ్యుడు తిరిగి తిరిగి అదే సభకు. 2009లో కొత్త అసెంబ్లీ వచ్చాక, అన్నీ ఉపఎన్నికలే.