నిద్రగన్నేరు చెట్టు

నిద్రపోతేనే కదా…కల వచ్చేదీ! మళ్ళీ ఆకలలో నిద్రపోతే…!?ఒక్కొక్కప్పుడు అలాగే జరుగుతుంది. ఇలలో చేసిన అన్ని పనులూ, కలలో కూడా చేస్తాం కదా! ఎవరినో కౌగలించుకున్నట్లూ, ముద్దు పెట్టినట్లూ , సుఖం పొందినట్లూ మాత్రమే కాదు…పరుగెత్తినట్లూ, అలసి పోయినట్లూ, నిద్రపోయినట్లూ కలవస్తుంది.మొద్దు నిద్ర. నిద్రలోని నిద్ర. కలలోని నిద్ర. మెలకువ వస్తే బాగుణ్ణు. గింజుకుంటున్నాడు. కళ్ళు తెరవలేక…

అక్కడ ‘జస్ట్‌ మెర్సీ’! ఇక్కడ ‘జై భీమ్’!!

అవసరాల మధ్యనే జీవిస్తుంటాం. అవసరాలు తీర్చుకోవటమే జీవిస్తుంటాం. తిరిగి అవసరాలను అన్వేషిస్తూనే జీవిస్తుంటాం.చెయ్యటానికో ఉద్యోగం, ఉండటానికో ఫ్లాటూ, తిరగటానికో కారు. తోడుకో సహచరీ లేదా సహచరుడూ, గొప్పలు పోవటానికి పిల్లలూ, వాళ్ళ ప్రాగ్రెస్‌ రిపోర్టులూ.. ఇవన్నీ అవసరాలే.ఇన్ని అవసరాల్లోనూ ఆవేశం కూడా అప్పుడప్పుడూ అవసరమయిపోతుంటుంది. దీనిని తీర్చిపెట్టటానికి కోట్లకు పడగలెత్తే వినోద పరిశ్రమ వుంటుంది. ఎప్పుడు…

‘ప్రేమోన్మాద’మేనా? ‘కులోన్మాదం’ కూడానా?

రమ్య హత్య కేవలం ఎప్పుడూ జరిగే ‘ప్రేమోన్మాద’ హత్య మాత్రమే కాదు; ‘కులోన్మాద’ హత్య కూడా. ‘ప్రేమోన్మాది’ ఆడపిల్లను ‘వస్తువు’గానే చూస్తాడు. ‘కులోన్మాది’ బానిసగా కూడా చూస్తాడు. వెరసి, కోరుకుంటూ వచ్చి ఒళ్లో వాలే ‘చవకబారు వస్తువు’గా చూస్తాడు. రమ్య దళిత యువతి.

‘మర్యాదస్తుల’ కోపాలకీ ‘కోటా’లుంటాయా?

అత్యాచారాలు ఈ దేశానికి కొత్త కాదు; దేశరాజధాని ఢిల్లీకి కూడా కొత్తకాదు. అందుకే ఇంకో పేరుతో కూడా ఆ నగరాన్ని పిలుస్తారు: ఈ దేశపు అత్యాచార రాజధాని (‘రేప్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ ఇండియా’). ఎన్నో అత్యాచారాలు జరిగినా, ‘నిర్భయ’ పై జరిగిన సామూహిక అత్యాచారం దేశాన్ని కుదిపివేసింది. దేశంలోని చదువుకున్న యువతీయువకులు ఆగ్రహోదగ్రులయిపోయారు. అదే ఢిల్లీ…

కులం పై సెర్చిలైటు- కొరియా ‘పారసైటు’!?

మన దరిద్రమేమిటో కానీ, దరిద్రాన్ని ఒకేలా చూస్తాం. సినిమా వాళ్ళూ అలాగే చూపిస్తారు. నలభయ్యేళ్ళ క్రితం బిచ్చగాడెలా వున్నాడో, ఇప్పుడూ అలాగే వుంటాడు. అలాగే అడుక్కు తింటాడు. చూసి,చూసి ప్రేక్షకుడికే కాదు, తీసితీసి దర్శకుడికి కూడా చికాకు వస్తుంది. దాంతో ‘కడుపు మాడే బిచ్చగాడు’ కాస్తా, ‘తినమరిగిన బిచ్చగాడి’ గా కనిపిస్తాడు, అప్పుడు వాడి చేత…

నిజం నాకు తెలుసు – నెపం నగ్నముని మీదకి!

ఒక జలప్రళయం ముగిశాక, సమస్త సృష్టీ సర్వనాశనమయ్యాక, నీటమునిగిన నేలతల్లి తేరుకున్నాక, ఒక వెలుగు కిరణం తొంగిచూశాక నోవహు తన ఓడనుంచి ఒక పిట్టను వదలుతాడు. ఒక పచ్చని మొక్క మొలకెత్తిన జాడను పిట్ట ముందుగా కనిపెడుతుంది. ఆ ‘వెలుతురు పిట్టే’ కవి. (ఈ మాటనిచ్చిన కవి మిత్రులు శ్రీమన్నారాయణ గారికి కృతజ్ఞతలు) అదే జలప్రళయం…

బోగీల్లోకి సరుకులు-పట్టాలపైకి బతుకులు!

తలుపు వెయ్యటం సులువే, తీయటమే కష్టం. విమానం టేకాఫ్‌ కావటం తేలికే; లాండ్‌ కావటమే ఇబ్బంది. పద్మవ్యూహంలోకి వెళ్ళటం సులభమే, రావటమే దుర్లభం- తెలివి వుంటే తప్ప. ఇంటికి కాదు, ఏకంగా దేశానికే తాళం వేసిపారేశారు. ఒక తాళం అయితే సరిపోదని ఎక్కడికక్కడ రాష్ట్రాలు ఎగబడి తాళం మీద తాళం ఎగబడి మరీ వేసేశారు. కారణం…

‘కాలా’కు కౌంటర్… ‘అల(కుల) వైకుంఠపురం లో’!?

రాను రాను రావణుడికి గిరాకీ పెరుగుతోంది. రాజకీయాల్లోనే కాదు, సినిమాల్లో కూడా. ఇలా ఈ పాత్రను చూడగా చూడగా, ప్రేక్షకులకు ఒక సందేహం వచ్చి తీరుతుంది. ఇంతకీ రావణుడు నాయకుడా? ప్రతినాయకుడా? (హీరోనా? విలనా?) రామాయణం విన్న వారికీ, చదివిన వారికీ అతడు ‘సీతమ్మ వారిని ఎత్తుకు పోయిన పది తలల రాక్షసుడు’. అయితే ఇంకాస్త…

‘ఊరు వెలుపలే’నా… ఈ ‘తెలుగు’ తబలా..!?

భాష అంటే కూసేదా? రాసేదా? ముందు కూసేది; తర్వాత రాసేది. చాలా భాషలు ఇప్పటికీ కూత దగ్గరే ఆగిపోయాయి. రాత వరకూ రాలేదు. మాట్లాడేదే భాష. ఈ వాగ్రూపానికి దృశ్యరూపం ఇస్తే అప్పుడు రాత. దీనినే మనం లిఖిత రూపం అనుకుంటాం. అదే లిపి. తెలుగు లిపి లో అక్షరాలు గుండంగా వుంటాయి. కుదురుగా రాస్తే,…

‘శివసాగరం’ కాదు – విప్లవ మహాభారతం!

శివసాగర్‌ ఒక యుగం పేరు! ఇది పొగడ్తా కాదు. తిట్టూ కాదు. ఏం అనుమానం లేదు. యుగమంటే కాలమే. కాలమే కవి కి జన్మనిస్తుంది.(శివసాగర్‌ మాటల్లోనే చెప్పాలంటే… ‘కాలం కడుపుతో వుండే’ కవిని కంటుంది.) ఆ కాలంలో అసలు కవితో పాటు చాలా మంది కవులు పుట్టుకొస్తారు. వారిని కాలం కనదు. వారు ‘స్వయంభువులు’. కాలం…

నవ్వమంటోంది కరోనా! ఏడ్వమంటోంది కరోనా!

.కరోనా! కరోనా! ప్రపంచ దేశాల నోట కరోనా నామ స్మరణే. వచ్చేస్తే, ‘వచ్చేసింది బాబోయ్‌’ అని. రాకుంటే ‘ఎప్పుడొస్తుందో..ఏమో!’ అని. ఇది దేశాధినేతల బాధ. ఇక ప్రజల తీరు వేరు. మన దేశంలో అయితే, 135 కోట్ల మందిని గృహనిర్బంధం చేశారు. వారూ ‘కరోనా’నే జపిస్తున్నారు. ఒకప్పుడయితే ఒక ఇంటి గోల ఒక ఇంటికి వినిపించేది…

కరోనా పక్కనే కల్చరల్‌ వైరస్‌ కూడా!

కరోనా. లోకంలో ఈ మాట తప్ప మరొకటి వినపడటం లేదు. మరో మాట వినటానికి కూడా లోకానికి ఇష్టం లేదు. కరోనా అసలు పేరు కోవిద్‌-19. ఇదో ఒక వైరస్‌ పేరు. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఈ ఒక్క వైరస్‌ తో యుధ్ధం చేస్తున్నాయి. మందు లేని రోగం. మందు కనుగొనటానికి సమయమివ్వని జాడ్యం. ఎక్కడ…