చాసో పసివాడు కూడా..!

చాసోకి చుట్టకాల్చడం ఇష్టం. అంతకన్నా కథలు రాయడం మరీ యిష్టం. ఎన్ని చుట్టలు కాల్చాడో లెక్కలేదు. కథలు మాత్రం కొన్నే రాశాడు. ఆ కొన్నింటిలోనూ సగం చించి పారేశాడు. నచ్చిన కథలు నలభై దాటతాయేమో. అంతే. చుట్ట సొంత సుఖం. చాసో లెక్క ప్రకారం సొంత సుఖానికి ఆట్టే ఆనందం వుండకూడదు. కానీ, చాసోకి చుట్ట…

నత్తనడక న్యాయానికి ‘ఎన్‌కౌంటర్‌’ విరుగుడా..?

ఎక్కడ చంపారో, అక్కడే చచ్చారు. అది కూడా పదిరోజుల్లో. ఇదీ న్యాయం! అసలు న్యాయమంటేనే ఇలా వుండాలి!? మరి? వాళ్ళు చేసింది మామూలు నేరమా? ఆ రోజు (నవంబరు 27) రాత్రి, షాద్‌ నగర్‌ వద్ద వెటర్నరీ డాక్టర్‌ ‘దిశ’ను ఎత్తుకు వెళ్ళి, అత్యాచారం చేసి, హత్య చేసి, తగులబెట్టారు. ఇంత నీచమైన నేరం చేసిన…

మెడకు ముంత కట్టినట్లు, నోటికి బూతు కట్టకండి!

ఏ భాష నేను మాట్లాడాలి? ((Which language should I speak?)) అరుణ్‌ కాంబ్లే అనే మరాఠీ దళిత కవి ప్రశ్నిస్తాడు. నిజమే. దళితులకో భాష ఉంటుందా? ఉంటే ఎలా వుంటుంది? ”ఒరే కొడకా. మనం మాట్లాడినట్టు మాట్లడరా. మనలా మాట్లాడు” అంటాడు కులవృత్తి వీపున మోస్తున్న తాత. ”ఓరి దద్దమ్మా! భాషను సరిగా ఉపయోగించరా!…

నటనకు నలుదిక్కులా దేవదాసు కనకాల

ప్రతీ పువ్వూ పుట్టగానే పరిమళించడం వంటి వెర్రివేషాలు వెయ్యదు. పుట్టు కవులు, పుట్టు కళాకారులు ఉండరు. కాకుంటే అలాంటి లక్షణమేదో చిన్నప్పటి చేష్టల్ని బట్టి పెరుగుతూ ఉంటుంది. అది ముదిరి ఏదో ఒక రోజున కళయి బైట పడుతుంది. దేవదాసు కనకాల ఒక నటుడు. కర్ణుడు కవచకుండలాలతో పుట్టినట్టు ఇతనేమీ మేకప్పు, విగ్గూ వగైరాలతో పుట్టలేదు.…

గోరా శాస్త్రి: పాత నాటకంలో కొత్త పాత్ర

గోరా శాస్త్రి రేడియోనాటికలు దూరాన్నే కాదు కాలాన్ని కూడా జయించాయి. పేరుకు శ్రవ్యనాటికలు కాని వాటినిండా దృశ్యాలే. పాత పుస్తకంలో కొత్త వాక్యం దొరికింది. – పాత పెట్టెలో ప్రియురాలి ఫొటో దొరికనట్లు. నిద్రపోతే ఒట్టు. తడిసిన కళ్లలాంటి పదాలు! కవిత్వమా? కాదు. పరమ పవిత్రమైన వచనం. జీవితాన్ని రక్తమాంసాలతో చూపించగలిగేది ఒక్క వచనమే కాబోలు!…

శ్రీశ్రీ: అందరి కవి! అందని రవి!

శ్రీశ్రీ ఎవరు? మహాకవి. ఈ విషయం నాకూ, మీకూ, మనందరికీ తెలియకముందే ఆయనకు తెలిసిపోయింది- తాను తారనయ్యానని ఒక నటుడికి ముందే తెలిసిపోయినట్లు. అందుకనే ‘ఈ శతాబ్దం నాది’ అని ఇరవయ్యవ శతాబ్దం మీద తన పేరు ముందుగా రాసేసుకున్నాడు. ముప్ఫయ్యవ దశకం వరకూ ఆధునిక తెలుగుకవిత్వాన్ని తాను చెయ్యిపట్టుకుని నడిపిస్తే, ఆ తర్వాత దాన్ని…

తెలుగు నాట ‘చిన్న’ బోయిన జాతీయ పార్టీలు!

తెలుగు రాష్ట్రాలు వేరయినా, ఒక రాష్ట్రంలోని రాజకీయాల ప్రభావం మరొక చోట పడుతూనే వుంది. నాలుగేళ్ళ తర్వాత ఈ ముద్ర మరింత పెరిగింది. ప్రాంతీయ వైరాలు- నేతల్లో సరేసరి- ప్రజల్లో తగ్గాయి. రాష్ట్రం ‘సమైక్యం’గా వున్నప్పటి అపోహలు ‘వేరు పడ్డాక’ తగ్గాయి. కాపురాలు వేరయ్యాక కలయకలు పెరిగాయి. తెలంగాణ కాస్త ముందుగా ఎన్నికలకు వెళ్ళటంతో ఈ…

జనసేనకు సీపీఐ గుడ్ బై..?

జెండా ఒక్కటే.. రంగు ఒక్కటే.. సిధ్ధాంతం ఒక్కటే. ఎజెండాయే వేరు. రెండూ కమ్యూనిస్టు పార్టీలే. ఒకటి సీపీఐ, మరొకటి సీపీఎం. రాజకీయంగా ’ఎడమ‘ వైపున వుండేవే.. కానీ ఎడమ ఎడమ గా వుంటాయి. తెలంగాణ ఉద్యమంలోనూ రెంటివీ రెండు దారులు. ఇప్పుడు తెలంగాణ ఎన్నికలలో నూ అంతే. సీపీఐ ’కూటమి’లో చేరితే, సీపీఎం ’బహుజన ఫ్రంట్‘ ఏర్పాటు చేసింది. అధికారంలో వున్న టీఆర్ఎస్ ను రెండూ విమర్శిస్తున్నాయి. కానీ టీఆర్ ఎస్ ను గద్దె దించాలని కేవలం సీపీఐ మాత్రమే కోరుకుంటుందా?
ఈ అంశం పై మాట్లాడటానికి సీపీఐ తెలంగాణ రాష్ర్ట కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ’టాక్ టు మీ‘ షోకు వచ్చారు.

ప్రేమగా కలిస్తే.. ‘పరువు’గా చావాలా..?

మూడు ప్రేమలు. మూడు పరువులు. మూడు దాడులు. మూడూ తెలంగాణ రాష్ట్రంలోనే. మూడూ దేశవ్యాపిత సంచలనాలే. చిత్రం. మూడు చోట్లా ప్రియుళ్ళు దళితులు. ప్రియురాళ్ళు ‘ఇతర’ కులస్తులు. అన్ని కథలకూ ముగింపు ఒక్కటే: నెత్తురు కళ్ళ చూడటం. తొలిఘటన జరిగి ఏడాది గడిచిపోయింది. మిగిలిన రెండు ఘటనలూ గత వారం రోజుల్లో జరిగాయి. మూడు స్థలాలు…

ముంచుకొస్తున్న ‘భయమే’ ముందస్తుకు కారణం!

అయిదేళ్ళ సభను ముందే రద్దు చేసి, మరో అయిదేళ్ళ అధికారాన్ని కోరుతున్నారు కేసీఆర్‌. అయినా ఈ ఎన్నికలను ‘ముందస్తు’ అనకూడదు. అంటే ఆయనకు కోపం వస్తుంది. ఎంత ముందయితే ‘ముందస్తు’ అనవచ్చో మరి? ఇంకా ఎనిమిది నెలలు (అయిదురోజులు తక్కువ లెండి) పదవీ కాలం వుందనగా ఎన్నికలకు వెళ్తున్నారు. అంటే, కేవలం ముందుగా కాదు, బాగా…

నాన్న సైకిలు

ఒకటి పెంగ్విన్‌ పిల్లలా నాన్న సైకిల్‌ మీద నేను చక్రాల కింద చిన్నబుచ్చుకున్న సముద్రాలు కన్ననేరానికి కాళ్ళాడిస్తున్నారాయన నడుపుతున్నానన్న భ్రమలో రెక్కలాడిస్తూనేను ”ఎక్కడికిరా కన్నా?” నా శిరస్సునడిగింది నాన్న గెడ్డం ”ఊరవతలకి!” దిక్సూచిలా నా చూపుడువేలు ఛెళ్ళుమన్నది సముద్రం నాన్న చెక్కిళ్ళన్నీ నీళ్ళే మలుపు తిరిగామో లేదో నా బుగ్గలమీదా అవే నీళ్ళు ”నాన్నా! ఉప్పగా…

కరుణ చరితే తమిళ భవిత !

కొందరికి జీవిత చరిత్ర అంటూ వేరే ఏదీ వుండదు. ఎందుకంటే వారికి జీవితమే చరిత్ర కాబట్టి. కరుణానిధి ఆకోవలోకి వస్తారు. ఆధునిక తమిళనాడు చరిత్రకూ ఆయన జీవిత చరిత్రకూ తేడా ఏమీ లేదు. ఏడున్నరదశాబ్దాల తమిళుల చరిత్రను ఎలా తిప్పి, ఎలా రాసినా అది ఆయన చరిత్రే అవుతుంది. అవును తాను రాసిందే చరిత్ర, తాను…