
ట్రంప్ మొండి. ఉత్త మొండి కాదు. జగమొండి. వణకడు.
తొణకడు. గెలిచాడు. ఓడాడు. మళ్ళీ గెలిచాడు.
పీక చుట్టుకున్న కేసులకూ అదరలేదు. చెవిపక్కనుంచే దూసుకుపోయిన బులెట్‌కూ బెరవలేదు. పడ్డ చోటనే లేచాడు.
కోపం.రావచ్చు; తెచ్చుకోవచ్చు.తెచ్చుకునే కోపాల్లో ఎక్కువ తక్కువలు వుండవచ్చు. ఎంత తెచ్చుకోవాలో అంతే తెచ్చుకునే స్థితప్రజ్ఞులు వుంటారు. అన్ని రంగాల్లోనూ కనిపిస్తారు. రాజకీయ నేతల్లో అయితే మరీను.కానీ, వచ్చే కోపం అలా కాదే. అది తన్నుకుని వచ్చేస్తుంది. దానికెవరూ ఆనకట్ట కాదు కదా, కనీసం బరాజ్ కూడా నిర్మించలేరు. సాదా సీదా మనుషులకు వచ్చేవి ఇలాంటి కోపాలే…
అంబేద్కర్. అవును. ఒక పేరే. భారతదేశపు నుదుటి రాతను (రాజ్యాంగాన్ని) రాసిన పేరు. ప్రపంచ అత్యున్నత సంస్థ (ఐక్యరాజ్యసమితి) ముచ్చటపడి స్మరించుకన్న పేరు.కానీ ఆ పేరే కోనసీమలో చిచ్చురేపింది. ఆ పేరు ‘వద్దంటే.. వద్దంటూ’ రోడ్లమీద కొచ్చారు. రాళ్ళు విసిరారు. ఇళ్ళు దగ్ధం చేశారు. పోలీసుల్ని (జిల్లా ఎస్పీ సహా) నెత్తురొచ్చేట్టు కొట్టారు. షెడ్యూల్డు కులానికి…
పదివసంతాలు దాటిన రాజకీయ వార పత్రికతెలుగు మేగజైన్ జర్నలిజం చరిత్రలో మైలురాయి నేడు రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాక, తెలుగు వారుండే పొరుగు రాష్ట్రాలలో అత్యధిక పాఠకాదరణ వున్న ఏకైక తెలుగు రాజకీయ పత్రికగా ‘గ్రేట్ ఆంధ్ర’ కొనసాగుతోంది. పత్రిక తేవటం వేరు; తెచ్చి నడపటం వేరు; నడిపి నిలపటం వేరు.దశాబ్దం గడచింది. గ్రేట్ ఆంధ్ర…
పిడికిలిని బిగించటం సులువే; సడలించకుండా వుండటమే కష్టం. అలా ఎంతసేపని బిగించి వుంచగలరు? కొన్ని గంటలు, లేదా కొన్ని రోజులు, కాకుంటే కొన్ని వారాలు. ఇదేమిటి? ఏకంగా ఏడాది పాటు సడలకుండా వుండటమేమిటి? చర్మాన్ని వాన తడిపేసినా, వేళ్ళను వాన కొరికేసినా, ముంజేతిని ఎండ కాల్చేసినా అదే బిగింపు. రైతు పిడికిలి. అయినా బెట్టు. ‘అధికారం…
వడ్లను వలిస్తే బియ్యం రావాలి, కానీ తెలంగాణలో కయ్యం వచ్చింది. అది కూడా రెండు అదికారపక్షాల మధ్య. ఒకటి కేంద్రంలో ఏలుబడి చేస్తున్న ‘కాషాయ’ పక్షం; మరొకటి రాష్ట్రంలో చక్రం తిప్పుతున్న ‘గులాబీ’ పక్షం. ఇది ‘కొని’ తెచ్చుకున్న కయ్యం కాదు, ‘కొనకుండా’ తెచ్చుకున్న కయ్యం. ‘నువ్వు కొను’ అంటే, ‘నువ్వు కొను’ అని రోడ్లెక్కుతున్న…
అవసరాల మధ్యనే జీవిస్తుంటాం. అవసరాలు తీర్చుకోవటమే జీవిస్తుంటాం. తిరిగి అవసరాలను అన్వేషిస్తూనే జీవిస్తుంటాం.చెయ్యటానికో ఉద్యోగం, ఉండటానికో ఫ్లాటూ, తిరగటానికో కారు. తోడుకో సహచరీ లేదా సహచరుడూ, గొప్పలు పోవటానికి పిల్లలూ, వాళ్ళ ప్రాగ్రెస్ రిపోర్టులూ.. ఇవన్నీ అవసరాలే.ఇన్ని అవసరాల్లోనూ ఆవేశం కూడా అప్పుడప్పుడూ అవసరమయిపోతుంటుంది. దీనిని తీర్చిపెట్టటానికి కోట్లకు పడగలెత్తే వినోద పరిశ్రమ వుంటుంది. ఎప్పుడు…
అత్యాచారాలు ఈ దేశానికి కొత్త కాదు; దేశరాజధాని ఢిల్లీకి కూడా కొత్తకాదు. అందుకే ఇంకో పేరుతో కూడా ఆ నగరాన్ని పిలుస్తారు: ఈ దేశపు అత్యాచార రాజధాని (‘రేప్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా’). ఎన్నో అత్యాచారాలు జరిగినా, ‘నిర్భయ’ పై జరిగిన సామూహిక అత్యాచారం దేశాన్ని కుదిపివేసింది. దేశంలోని చదువుకున్న యువతీయువకులు ఆగ్రహోదగ్రులయిపోయారు. అదే ఢిల్లీ…
మన దరిద్రమేమిటో కానీ, దరిద్రాన్ని ఒకేలా చూస్తాం. సినిమా వాళ్ళూ అలాగే చూపిస్తారు. నలభయ్యేళ్ళ క్రితం బిచ్చగాడెలా వున్నాడో, ఇప్పుడూ అలాగే వుంటాడు. అలాగే అడుక్కు తింటాడు. చూసి,చూసి ప్రేక్షకుడికే కాదు, తీసితీసి దర్శకుడికి కూడా చికాకు వస్తుంది. దాంతో ‘కడుపు మాడే బిచ్చగాడు’ కాస్తా, ‘తినమరిగిన బిచ్చగాడి’ గా కనిపిస్తాడు, అప్పుడు వాడి చేత…
రాను రాను రావణుడికి గిరాకీ పెరుగుతోంది. రాజకీయాల్లోనే కాదు, సినిమాల్లో కూడా. ఇలా ఈ పాత్రను చూడగా చూడగా, ప్రేక్షకులకు ఒక సందేహం వచ్చి తీరుతుంది. ఇంతకీ రావణుడు నాయకుడా? ప్రతినాయకుడా? (హీరోనా? విలనా?) రామాయణం విన్న వారికీ, చదివిన వారికీ అతడు ‘సీతమ్మ వారిని ఎత్తుకు పోయిన పది తలల రాక్షసుడు’. అయితే ఇంకాస్త…
తెలుగు రాష్ట్రాలు వేరయినా, ఒక రాష్ట్రంలోని రాజకీయాల ప్రభావం మరొక చోట పడుతూనే వుంది. నాలుగేళ్ళ తర్వాత ఈ ముద్ర మరింత పెరిగింది. ప్రాంతీయ వైరాలు- నేతల్లో సరేసరి- ప్రజల్లో తగ్గాయి. రాష్ట్రం ‘సమైక్యం’గా వున్నప్పటి అపోహలు ‘వేరు పడ్డాక’ తగ్గాయి. కాపురాలు వేరయ్యాక కలయకలు పెరిగాయి. తెలంగాణ కాస్త ముందుగా ఎన్నికలకు వెళ్ళటంతో ఈ…
మూడు ప్రేమలు. మూడు పరువులు. మూడు దాడులు. మూడూ తెలంగాణ రాష్ట్రంలోనే. మూడూ దేశవ్యాపిత సంచలనాలే. చిత్రం. మూడు చోట్లా ప్రియుళ్ళు దళితులు. ప్రియురాళ్ళు ‘ఇతర’ కులస్తులు. అన్ని కథలకూ ముగింపు ఒక్కటే: నెత్తురు కళ్ళ చూడటం. తొలిఘటన జరిగి ఏడాది గడిచిపోయింది. మిగిలిన రెండు ఘటనలూ గత వారం రోజుల్లో జరిగాయి. మూడు స్థలాలు…
అయిదేళ్ళ సభను ముందే రద్దు చేసి, మరో అయిదేళ్ళ అధికారాన్ని కోరుతున్నారు కేసీఆర్. అయినా ఈ ఎన్నికలను ‘ముందస్తు’ అనకూడదు. అంటే ఆయనకు కోపం వస్తుంది. ఎంత ముందయితే ‘ముందస్తు’ అనవచ్చో మరి? ఇంకా ఎనిమిది నెలలు (అయిదురోజులు తక్కువ లెండి) పదవీ కాలం వుందనగా ఎన్నికలకు వెళ్తున్నారు. అంటే, కేవలం ముందుగా కాదు, బాగా…